ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి యువరాజ్ సింగ్ ఎంట్రీ?.. ఐపీఎల్ 2027కు భారీ ప్లాన్స్!

ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి యువరాజ్ సింగ్ ఎంట్రీ?.. ఐపీఎల్ 2027కు భారీ ప్లాన్స్!

Yuvraj Singh Set to Join Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2027) రాబోయే సీజన్‌కు ముందే ఒక బిగ్గెస్ట్ అప్‌డేట్ క్రికెట్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. టీమిండియా లెజెండరీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) మెంటార్/కోచ్ అవతారం ఎత్తబోతున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు.. తమ తొలి ట్రోఫీ లక్ష్యంగా యువరాజ్ సింగ్‌ను కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. యువీకి ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఇదే మొదటి కోచింగ్ కావడం విశేషం.

లేట్‌గా వచ్చినా.. లేటెస్ట్‌గా వస్తున్న యువీ: 
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ ప్రతినిధి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. యువరాజ్ సింగ్ లాంటి లెజెండ్ డగౌట్‌లో ఉండాలని ఎవరు కోరుకోరు?.. ఆయన కోచింగ్ రేసులోకి కాస్త లేట్‌గా వచ్చి ఉండొచ్చు, కానీ అతనికి యువ ఆటగాళ్లను ఎలా గైడ్ చేయాలో బాగా తెలుసు.. అతను కేవలం ఫోన్లలో సలహాలు ఇచ్చే టైప్ కాదు.. ఎండనక, వాననక గంటల తరబడి నెట్స్ వెనుక నిలబడి ప్లేయర్ల తప్పులను సరిదిద్దే హ్యాండ్స్-ఆన్ మెంటార్.. అతని రాక ఢిల్లీ టీమ్‌కు కొండంత బలాన్ని ఇస్తుందని వెల్లడించాడు. 

దాదాతో జతకట్టనున్న సిక్సర్ల కింగ్: 
ఐపీఎల్‌లో జరిగిన అంతర్గత ఒప్పందం ప్రకారం.. రాబోయే రెండేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బాధ్యతలను JSW గ్రూప్ చూసుకోనుంది. JSW క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మళ్లీ మెన్స్ టీమ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవల సౌతాఫ్రికా T20 (SA20) లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లిన దాదాను.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్ కోచ్‌గా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దీంతో గంగూలీ-యువరాజ్ సింగ్ ల సూపర్ హిట్ కాంబినేషన్‌ను మనం మళ్లీ ఢిల్లీ డగౌట్‌లో చూడబోతున్నాం.

ALSO READ : 100వ మ్యాచ్‌లో జుగ్‌రాజ్ సింగ్ గోల్..

కెప్టెన్ గా కేఎల్ రాహుల్?.. పంత్ వర్సెస్ కుల్దీప్ ట్రేడ్: 
ఈ కోచింగ్ మార్పులతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌లో మరికొన్ని ఊహించని ట్విస్టులు కూడా ఉన్నాయి. ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ (KL Rahul) ను నియమించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మాజీ కెప్టెన్ రిషభ్ పంత్‌ను మళ్లీ ఢిల్లీలోకి తెచ్చుకుని.. బదులుగా ఢిల్లీ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను లక్నో టీమ్‌కు ట్రేడ్ చేసేందుకు భారీ స్కెచ్ నడుస్తోందట.