T20 World Cup: కెనడాను భయపెడుతున్న యూఏఈ బౌలర్లు.. ఆసక్తికరంగా మరో మ్యాచ్

T20 World Cup: కెనడాను భయపెడుతున్న యూఏఈ బౌలర్లు.. ఆసక్తికరంగా మరో మ్యాచ్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ గ్రూప్ Dలోని కెనడా, UAE తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కెనడా ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. రెండు జట్లు చిన్నవే.. ఈ రెండింటికి గెలుపు చాలా కీలకం. రెండు జట్లు గెలుపు ధీమాతో బరిలోకి దిగాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన కెనడా.. స్టార్టింగ్ నుంచే తడబడింది. 11 ఓవర్లు ఆడిన కెనడా జట్టు.. 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 11 ఓవర్లు ముగిసే సరికి 81 పరుగులు మాత్రమే చేసింది. కెనడా ఓపెనర్లు యువరాజ్ శర్మ 5 బంతుల్లో 5 పరుగులు చేయగా, మరో ఓపెనర్..  కెప్టెన్ దిల్ ప్రీత్ బజ్వా 11 బంతుల్లో జస్ట్ 11 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 

తక్కువ పరుగులకే కెనడా జట్టు ఓపెనర్లు ఔట్ కావడంతో.. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన నిలోలస్ కిర్టన్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు.. 6 బంతులు ఆడి 4 పరుగులు మాత్రమే చేశాడు. హిట్టర్ గా పేరున్న వననీత్ థాలివాల్, హర్ష టకర్ క్రీజ్ లో నిలదొక్కుకోవటానికి తెగ కష్ట పడుతున్నారు. వికెట్లు కాపాడుకునే పనిలో ఉన్న కెనడా జట్టు.. 11 ఓవర్లలో 81 పరుగులు మాత్రమే చేసింది. 

మరోవైపు, అమెరికా బౌలర్లు చెలరేగిపోతున్నారు. జునైద్ సిద్ధిఖీ 2 ఓవర్లు వేసి.. రెండు వికెట్లు తీసుకోగా.. మరో బౌలర్ మహ్మద్ జవాదుల్లా ఒక ఓవర్ వేసి ఒక్క రన్ ఇచ్చి.. ఒక వికెట్ తీసుకున్నాడు. మొత్తంగా రెండు చిన్న జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ చాలా ఇంట్రస్టింగ్ గా కొనసాగుతుంది. ఈ విజయం ఇరు జట్లకు చాలా కీలకం. ఎందుకంటే రెండు జట్లు ఇప్పటి వరకు టోర్నమెంట్ లో బోణీ కొట్టలేదు. ఒక్కొక్క మ్యాచ్ ఆడిన కెనడా, యూఏఈ.. ఆ మ్యాచుల్లో ఓడిపోయాయి. సో.. ఏ జట్టు గెలిచినా టీ 20 వరల్డ్ కప్ లో ఖాతా తెరిచినట్లే..