- ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేందుకు దేశవ్యాప్త పోరాటం..
- సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం
- వీబీ జీ రామ్ బిల్లు తో రాష్ట్రాలపై ఆర్థిక భారం
- కేబినెట్లో చర్చించకుండా నిర్ణయం
- దేశ వ్యాప్త పోరాటానికి పిలుపునిచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ
- పోరాటం ఆగదు: ఖర్గే
- మీటింగ్ కు హాజరైన సీఎం రేవంత్
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని.. వీబీ జీ రామ్ బిల్లుతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పేదలను కొట్టి పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నా రని ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
2025 డిసెంబర్ 27న ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చీఫ్ మల్లి కార్జున ఖర్గే, తెలంగాణ, కర్నాటక ముఖ్య మంత్రులు రేవంత్ రెడ్డి, సిద్దరామయ్య, పార్టీ సీనియర్ నేత శశిథరూర్ తో సహా అనేకమంది హాజరయ్యారు. ఈసందర్భంగా నేతలు పలు కీలక నిర్ణయాలపై చర్చించారు.
►ALSO READ | ఇండియన్స్‌ని డిపోర్ట్ చేయటంలో అమెరికాను దాటేసిన సౌదీ.. ఆ తప్పుల వల్లనే..!
అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. 'ఉపాధి హామీ పథకానికి గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానించారు. కేబినెట్ లో పెట్ట కుండా.. దీనిపై కనీసం చర్చ చేయకుండా పేరు
మార్చారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరిక వ్యవస్థా? పెట్టుబడిదారులను కాపాడేందుకు పేదల పొట్ట కొట్టే కుట్రలు చేస్తున్నరు. ఉపాధి హామీ పథకం కేవలం ఒక స్కీమ్ కాదు. అది గ్రామీణ స్వరాజ్యానికి ప్రతీక' అని అన్నారు
పోరాటం ఆగదు: ఖర్గే
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడం అన్యాయమని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. 'వీబీ జీ రామ్ జీ బిల్లుపై రాష్ట్రాలతో కేంద్రం చర్చించలేదు. పదేండ్లుగా పథకానికి నిధులు తగ్గిస్తూ వచ్చారు. గతంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రాలు 10 శాతం భారం భరించేవి. ఇకపై కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదు' అని అన్నారు.
