కొత్త ఏడాది 2026 బైక్ లవర్స్ కి అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోంది. జనవరి నెలలోనే దేశీయ మార్కెట్లోకి ప్రముఖ బ్రాండ్ల నుంచి నాలుగు శక్తివంతమైన బైక్‌లు సందడి చేయనున్నాయి. అడ్వెంచర్ రైడింగ్ నుంచి క్లాసిక్ క్రూజింగ్ వరకు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఈ మోడల్స్ ఉండనున్నాయి. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. BMW F 450 GS:
అడ్వెంచర్ బైక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోడల్ ఇది. తమిళనాడులోని టీవీఎస్ ప్లాంట్‌లో తయారవుతున్న ఈ బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450, కేటీఎం 390 అడ్వెంచర్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇందులో 420cc ట్విన్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 47 bhp పవర్‌ను విడుదల చేస్తుంది. 6.5-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, ఈజీ రైడ్ క్లచ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
2. Royal Enfield Bullet 650:
యువతలో బుల్లెట్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే ఐకానిక్ డిజైన్‌తో 650cc పవర్ ఫుల్ ఇంజన్‌తో 'బుల్లెట్ 650' రాబోతోంది. ఇది 46.4 bhp శక్తిని ఇచ్చే ప్యారలల్-ట్విన్ ఇంజన్‌తో పనిచేస్తుంది. క్లాసిక్ లుక్‌తో పాటు ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఆధునిక హంగులతో ఈ బైక్ రాబోతోంది.
3. KTM 390 Adventure R:
ఆఫ్-రోడింగ్ చేయడమంటే ఇష్టపడే వారి కోసం కేటీఎం ఈ 'R' వర్షన్‌ను లాంచ్ చేస్తోంది. సాధారణ 390 అడ్వెంచర్ కంటే ఇది ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, భారీ సస్పెన్షన్ కలిగి ఉంటుంది. 398cc ఇంజన్‌తో 44 bhp పవర్‌ను ఇచ్చే ఈ బైక్ కఠినమైన దారుల్లో ప్రయాణించడానికి అనువుగా డిజైన్ చేయబడింది. ప్రస్తుతానికి దీని ఎక్స్ షోరూం ధర రూ.3లక్షల 95వేలుగా నిర్ణయించబడింది.
ALSO READ : DGCAకి నివేదిక ఇచ్చిన దర్యాప్తు కమిటీ..అందులో ఏముందంటే.?
4. Brixton Crossfire 500 Storr:
ఇక చివరిగా ఆస్ట్రియాకు చెందిన బ్రిక్స్టన్ బ్రాండ్ నుంచి వస్తున్న తొలి అడ్వెంచర్ బైక్ కొత్త ఏడాది అడుగుపెడుతోంది భారత మార్కెట్లోకి. దీని లుక్ చాలా వెరైటీగా, 'నియో-రెట్రో' స్టైల్‌లో ఉంటుంది. 486cc ట్విన్-సిలిండర్ ఇంజన్‌తో వచ్చే ఈ బైక్.. 16 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 7-అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. కొత్త రకం డిజైన్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీని ధర రూ.4లక్షల వరకు ఉండొచ్చని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి.
