టిప్పర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం.. బస్సులో 60 మంది

టిప్పర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం.. బస్సులో 60 మంది

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ నుంచి హైదరాబాద్ లోని పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు  ఆగి ఉన్న టిప్పర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి  NH 65పై జరిగిన ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయి. 

హైవేపై కంది దగ్గర ఆగి ఉన్న టిప్పర్‌ ను వెనక నుంచి బస్సు ఢీకొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా తూళి సీట్లలో నుంచి కింద పడిపోయారు.  ముందు సీట్లకు గుద్దుకుని గాయాలయ్యాయి.  గాయపడ్డ వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కొందరికి తీవ్ర గాయాలైనట్లు ఘటనాస్థలంలో ఉన్నవారు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. 

డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే యాక్సిడెంట్ జరిగిందని ప్రయాణికులు తెలిపారు. మొత్తం ప్రయాణికులలో 22 మందికి గాయాలయ్యాయని తెలిపారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారని.. చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.