బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత : అడిష నల్ కలెక్టర్ నగేశ్

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత :  అడిష నల్ కలెక్టర్ నగేశ్

మెదక్, వెలుగు: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని అడిషనల్​ కలెక్టర్​ నగేశ్​ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో జస్ట్  రైట్స్  ఫర్  చిల్డ్రన్, విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డీడబ్ల్యూవో హేమ భార్గవితో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాల్యవివాహాలపై అవగాహన కల్పించాలని సూచించారు. 

బాల్యం ఎంతో విలువైందని, బాలబాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ, హక్కులు కల్పించడం  అందరి బాధ్యత అని పేర్కొన్నారు. డీపీఆర్వో రామచంద్ర రాజు, జిల్లా బాలల సంరక్షణ అధికారి నాగరాజు, మహిళా శక్తి కేంద్ర కో ఆర్డినేటర్  సంతోషి, విజన్  సంస్థ డైరెక్టర్  కైలాశ్, ప్రాజెక్ట్  కో ఆర్డినేటర్లు రాజు, శరత్,  సిబ్బంది సంజీవ్, నవనీత పాల్గొన్నారు.