- కేవలం చేతులు పైకెత్తిన ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఆంథ్రోపిక్ సీఈఓ ,డారియో అమోడెయ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్’లో ఇబ్బందికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సమిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రపంచస్థాయి టెక్ లీడర్లంతా ఒకే వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా వారంతా గ్రూప్ ఫొటోకు పోజిచ్చిన సమయంలో ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ చేతులు కలిపేందుకు ఇష్టపడలేదు. వారిద్దరూ పిడికిలి బిగించి ఫొటోకు పోజులిచ్చారు.
ఈ పరిణామంతో వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇద్దరు సీఈఓల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలున్నాయి. 2021లో ఆంథ్రోపిక్‌ను ప్రారంభించిన సమయంలో దీనికి బీజం పడింది. డారియో అమోడెయ్ ఓపెన్ ఏఐలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో పని చేశారు. అప్పుడు తన బాస్‌గా ఉన్న ఆల్ట్‌మన్ విధానాలను విమర్శిస్తూ ఆ సంస్థను వీడారు. భద్రత కంటే వ్యాపారానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.
