విశ్వక్‌‌‌‌ సేన్‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌ లో కల్ట్‌‌‌‌.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. 

విశ్వక్‌‌‌‌ సేన్‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌ లో కల్ట్‌‌‌‌.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. 

ఫలక్‌‌‌‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ లాంటి చిత్రాలతో దర్శకనిర్మాతగానూ మెప్పించిన హీరో విశ్వక్‌‌‌‌ సేన్.. ఇప్పుడు మరో సినిమా తెరకెక్కించబోతున్నాడు.  ‘కల్ట్‌‌‌‌’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని  తారక్ సినిమాస్ బ్యానర్ పై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు. గురువారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో విశ్వక్‌‌‌‌ సూట్‌‌‌‌లో కనిపిస్తుండగా, తన చేతిలో రక్తంతో తడిసిన గొడ్డలి కనిపిస్తోంది. హారర్‌‌‌‌‌‌‌‌కు సబ్‌‌‌‌ జానర్‌‌‌‌‌‌‌‌ అయిన స్లాషర్‌‌‌‌‌‌‌‌ జానర్‌‌‌‌‌‌‌‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  

ఫిబ్రవరి 21న టీజర్‌‌‌‌ను విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగర్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నలభై మంది కొత్త నటీనటులను ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నారు. భారతదేశంలో తొలి స్లాషర్ ఫిల్మ్‌‌‌‌గా రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్‌‌‌‌లో ఇప్పటివరకు చూడని కొత్త ప్రయత్నంగా నిలవనుందని మేకర్స్‌‌‌‌ చెబుతున్నారు. 

తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తుండగా, రవి బస్రూర్  మ్యూజిక్‌‌‌‌ అందిస్తున్నారు. అర్వింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్. తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.