ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పాలి. తెలుగు , తమిళం, కన్నడ, హిందీ, మలయాళం వంటి విభిన్న భాషల నుంచి, రకరకాల జానర్లలో ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సందడి చేయబోతున్నాయి. రొమాంటిక్ కామెడీల నుండి వెన్నులో వణుకు పుట్టించే హర్రర్ థ్రిల్లర్ల వరకు రెడీ అవుతున్నాయి. ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూసే టాప్ ఓటీటీ రిలీజ్ సినిమాలు చూద్దాం..
కార్తీక్ ఆర్యన్ 'తు మేరీ మైన్ తేరా'
బాలీవుడ్ లవర్ బాయ్ కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం 'తు మేరీ మైన్ తేరా మైన్ తేరా తు మేరీ' (Tu Meri Main Tera). సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఈ రోజు ( ఫిబ్రవరి 19 ) నుండి అందరికీ అందుబాటులోకి వచ్చింది.
మలయాళ హిట్ 'చథా పచ్చ'
మలయాళంలో రూ. 30 కోట్లకు పైగా వసూలు చేసిన యాక్షన్ కామెడీ 'చథా పచ్చ' (Chatha Pacha). అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 19న రిలీజ్ చేశారు. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉండబోతోంది.
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, రవితేజ కామెడీ టైమింగ్ కోసం ఈ సినిమాను చూడవచ్చు. ఈ చిత్రం ఫిబ్రవరి 20 నుండి జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ కానుంది.
అనురాగ్ కశ్యప్ 'కెన్నెడీ'
విలక్షణ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన నోయిర్ థ్రిల్లర్ 'కెన్నెడీ' (Kennedy). సన్నీ లియోన్, రాహుల్ భట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలోనే విడుదల కాబోతోంది. చనిపోయాడని భావించిన ఒక మాజీ పోలీసు అధికారి, అండర్ గ్రౌండ్‌లో ఉంటూ వ్యవస్థలోని అవినీతిపై ఎలా పోరాడాడనేది ఈ సినిమా కథాంశం. ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ ఫిబ్రవరి 20 నుండి జీ5 (ZEE5) లో అందుబాటులోకి వస్తుంది.
లక్కీ ది సూపర్ స్టార్
జీవీ ప్రకాష్ కుమార్ నటించిన వెబ్ ఫిల్మ్ 'లక్కీ ది సూపర్ స్టార్' (Lucky The Superstar). 'ఫ్యామిలీ మ్యాన్'లో చెల్లం సర్ పాత్రతో ఫేమస్ అయిన ఉదయ్ మహేష్ దీనికి దర్శకత్వం వహించారు. ఒక పెంపుడు కుక్క చుట్టూ తిరిగే ఈ హృద్యమైన కథ ఇది. పిల్లలకు, కుటుంబ సభ్యులకు బాగా నచ్చుతుంది. ఇది ఫిబ్రవరి 20 నుండి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
హారర్ థ్రిల్లర్ “ఈషా”
టాలీవుడ్ యువ నటీనటులు అదిత్ అరుణ్, హెబ్బా పటేల్, సిరి హన్మంత్, అఖిల్ రాజ్ లు నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం 'ఈషా'. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ ఫిబ్రవరి 20 నుంచి సినీ ప్రియులకు అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో బబ్లు పృథ్వీ నెగిటివ్ రోల్ లో నటించారు. కెఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు.
హర్రర్ థ్రిల్లర్ 'రాక్షస'
కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ నటించిన హర్రర్ థ్రిల్లర్ 'రాక్షస' (Raakshasa). లోహిత్ హెచ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సైకలాజికల్ ట్విస్టులతో ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమైంది. ఈ హర్రర్ థ్రిల్లర్ ఫిబ్రవరి 20 నుండి జీ5 లో చూడవచ్చు.
హాట్ స్పాట్ 2 మచ్
తమిళ ఆంథాలజీ చిత్రం 'హాట్ స్పాట్ 2 మచ్' Hot Spot 2 Much). మహిళల వస్త్రధారణపై సామాజిక చర్చను రేకెత్తించిన ఈ చిత్రంపై ఇప్పటికే నెట్టింటా ఆసక్తి నెలకొంది. ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 20 నుండి ఆహా తమిళ్ , అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.
శ్రీ చిదంబరం గారు
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'శ్రీ చిదంబరం గారు'. వినయ్ రత్నం దర్శకత్వం వహించిన ఈ రూరల్ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీకి వచ్చేస్తోంది. పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల మధ్య ఉండే అనుబంధాలను ఈ చిత్రంలో హృద్యంగా చూపించారు. తులసి, కల్పలత వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19 నుండి ఈటీవీ విన్ (ETV Win) లో స్ట్రీమింగ్ కావాల్సిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26కి వాయిదా వేశారు.
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు'
టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ ఉదయ్ భాను ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు' (D/o Prasad Rao: Kanabadutaledhu). గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సిరీస్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఎమోషనల్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఉదయభాను రీ ఎంట్రీ ఇచ్చింది.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'జీ 5' ( zee5 )లో ఫిబ్రవరి 27న స్ట్రీమింగ్ కానుంది
నే ఝ2 ( Ne Zha 2)
ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ డాలర్లను వసూళ్లు చేసిన యానిమేషన్ చిత్రం 'నే ఝ2' ( Ne Zha2) ఆంగ్లేతర చిత్రంగా ఇది ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన ఈ అనిమేషన్ మూవీ ఫిబ్రవరి 20 నుండి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది మాండరిన్, ఇంగ్లీష్, హిందీ భాషలలో ప్రసారం కానుంది.
