రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల ప్రేమాయణం ఎంత హాట్ టాపిక్‌గా నిలిచిందో, ఇప్పుడు వీరి పెళ్లి వార్తలు కూడా అంతే వేగంగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి డేట్, వెన్యూ, వెడ్డింగ్ కార్డ్, అతిథుల లిస్ట్.. ఇలా ప్రతిదీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్ అవుతూ రౌడీ ఫ్యాన్స్ని అలెర్ట్ చేస్తోంది.
విజయ్ పెళ్లి డేట్ (ఫిబ్రవరి 26) దగ్గర పడుతుండటంతో దేవరకొండ వారి ఇల్లు నిండైన కాంతులతో వెలిగిపోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ నెటిజన్లని ఆకర్షిస్తోంది. పోనీ ఇప్పట్లో ఏదైనా పండుగ ఉందంటే అది కూడా లేదు.. సో, విజయ్ ఇల్లు ఇంత రంగు రంగుల కాంతులతో ముస్తాబై ఉందంటే.. బ్యాండ్ భాజాతో భజంత్రిలు మోగినట్టే అన్నమాట! రేపో మాపో పెళ్లిపై అనౌన్స్ రావడం పక్కా అనే తెలుస్తోంది.
వెలుగులతో మెరిసిన విజయ్ ఇల్లు
విజయ్-రష్మికల పెళ్లి టాక్ సందర్భంగా ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసం వివాహానికి ముందు దీపాల అలంకరణతో మెరిసిపోతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఇంటి ముందు ప్రత్యేక లైటింగ్, పుష్పాలంకరణలతో సన్నాహాలు జరుగుతున్న ఫోటోలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటివరకు ఈ విజయ్-రష్మిక నుంచి పెళ్లి తేదీపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇంటి అలంకరణలు, వైరల్ వెడ్డింగ్ కార్డుతో పెళ్లి వార్తలు మరింత బలపడుతున్నాయి.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం ‘రౌడీ జనార్థన్’ తో పాటుగా ‘రణబాలి’ సినిమా చేస్తున్నాడు. రష్మిక మందన్న పాన్ ఇండియా క్రేజ్‌తో పలు భారీ ప్రాజెక్టులలో నటిస్తోంది. వృత్తిపరంగా ఇద్దరూ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకోవడం విశేషం.
ఇకపోతే, ఫిబ్రవరి 26న పెళ్లి వేడుక రాజస్థాన్‌లో ముగిసిన తర్వాత, హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో మార్చి 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
విజయ్-రష్మికల రణబాలి:
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ పాన్-ఇండియా మూవీ 'రణబాలి' (VD14). రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ మూవీ టైటిల్ గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. బ్రిటీష్ కాలం నాటి కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
