రాజ్యసభ రేసు లో లేను : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు

రాజ్యసభ రేసు లో లేను : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు

హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ సభ్యత్వాన్ని తాను ఆశించడం లేదని  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు స్పష్టం చేశారు. ఆ ఎన్నికల రేసులో తాను ఉన్నట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. 

ఈ మేరకు గురువారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రెండున్నరేండ్ల క్రితమే రాజ్యసభ సభ్యత్వానికి  రాజీనామా చేశానని, ఇక ఆ పదవిపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని తెలిపారు.