సంగారెడ్డి సెంట్రల్ జైలులో గుండె పోటుతో రిమాండ్ ఖైదీ మృతి

సంగారెడ్డి సెంట్రల్ జైలులో గుండె పోటుతో రిమాండ్ ఖైదీ మృతి

సంగారెడ్డి: గుండె పోటుతో రిమాండ్ ఖైదీ మృతి ఘటన సంగారెడ్డి సెంట్రల్ జైలులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. విఠల్ అనే వ్యక్తిపై హత్యాయత్నం, రివాల్వర్‎తో బెదిరించాడనే ఆరోపణలపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో పోలీసులు విఠల్‎ను అరెస్ట్ చేసి జ్యుడిషయల్ రిమాండ్‎లో భాగంగా 2026, జనవరి 31న సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. 

రిమాండ్ ఖైదీగా ఉన్న విఠల్‎ గురువారం (ఫిబ్రవరి 19) జైల్లో గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే జైలు సిబ్బంది అతడిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విఠల్ మృతి చెందాడు. విఠల్ స్వస్థలం సంగారెడ్డి జిల్లా వట్‎పల్లి మండలం మర్వెళ్లి గ్రామమని పోలీసులు తెలిపారు.