ఇండియన్ ఆర్మీలో కొలువుల సందడి మొదలైంది. ఎంతో కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న నిరుద్యోగులకు ఇదైతే బంపర్ ఆఫరే. నెలకు 75 వేల రూపాయల స్టైపెండ్ తో ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కు అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది ఆర్మీ. 2026-27 ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించిన ఆర్మీ.. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చింది.
ఈ ఇంటర్న్‌షిప్ AICTE ఇంటర్న్‌షిప్ పోర్టల్ ద్వారా అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ , హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ వంటి వివిధ రంగాలకు సంబంధించి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో, జాతీయ భద్రతకు సంబంధించిన టెక్నాలజీ, కమ్యూనికేషన్ ప్రాజెక్టులపై ఇండియన్ ఆర్మీ టెక్నీషియన్స్ తో కలిసి పనిచేసే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది.
స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్.. ఏంటి దీని ప్రత్యేకత?
ఈ కార్యక్రమంలో అందించే అత్యంత విలువైన ఇంటర్న్‌షిప్‌లలో ఒకటి స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ ఇంటర్న్‌షిప్, దీనిని అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ (ADG స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్) అందిస్తున్నారు.
BJMC (జర్నలిజం) విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ ఇంటర్న్‌షిప్,15 అకడమిక్ క్రెడిట్‌లతో 75 వర్కింగ్ డేస్ యాడ్ అవుతాయి.
ఈ ఇంటర్న్‌షిప్ హైబ్రిడ్ పద్ధతిలో అందిస్తారు. మొదటి 15 రోజులలో విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువుకుంటారు, ఆ తర్వాత 60 రోజులు ఢిల్లీలోని క్యాంపస్‌లో ఉండి నేర్చుకుంటారు.
మీడియా విశ్లేషణ, ప్రవర్తనా అధ్యయనాలు, డిజిటల్ స్టోరీటెల్లింగ్, సోషల్ మీడియా ప్రచారాలు, ప్రజా వ్యవహారాలు, ప్రేక్షకుల భాగస్వామ్యం ద్వారా సైన్యం డిజిటల్ కమ్యూనికేషన్ ప్రణాళిక , నిర్వహణను ఎలా చేపడుతుందో అర్థం చేసుకుంటారు. ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం విద్యార్థులకు డేటా ఆధారిత డిజిటల్ కమ్యూనికేషన్ పద్ధతులను కూడా పరిచయం చేస్తుంది.
ALSO READ : మరో పోలీస్ నోటిఫికేషన్.. 325 ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు..
భారత సైన్యం ఇంటర్న్‌షిప్ 2026: స్టైపెండ్, అటెండెన్స్ రూల్స్
ఎంపికైన విద్యార్థులకు రూ.75 వేల వరకు స్టైపెండ్‌కు అందిస్తారు. ఇది ప్రోగ్రామ్ వ్యవధిలో నెలకు రూ.30 వేల చొప్పున అందిస్తారు.
అయితే, ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మాత్రమే విద్యార్థులకు స్టైపెండ్ లభిస్తుంది. విద్యార్థులు కనీసం 75% హాజరును తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే, వారికి ఎలాంటి స్టైపెండ్ లభించదు.
ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం న్యూ ఢిల్లీ/ఎన్‌సిఆర్‌లో జరుగుతుంది, విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాలు ఉండవు.. సొంత ఏర్పాట్లు చేసుకోవాలి.
ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2026-27.. వివిధ రంగాల అధ్యయనం:
భారత సైన్యం ఈ క్రింది వాటితో సహా అనేక అడ్వాన్స్డ్ టెక్నాలజీ, నిర్వహణ రంగాలలో ఇంటర్న్‌షిప్‌లను అందిస్తోంది:
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్
- సైబర్ సెక్యూరిటీ , ఎథికల్ హ్యాకింగ్
- క్వాంటం కంప్యూటింగ్, క్రిప్టోగ్రఫీ
- డ్రోన్ మరియు UAV సాంకేతికతలు
- రోబోటిక్స్ , అటానమస్ బాడీస్
- అంతరిక్ష , శాటిలైట్ టెక్నాలజీస్
- డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ , అడ్వాన్స్డ్ వెపన్స్ సిస్టమ్స్,
- 5G, 6G కమ్యూనికేషన్ టెక్నాలజీలు
- ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్)
- స్ట్రాటజిక్ కమ్యూనికేషన్, మాస్ మీడియా
- హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్
- ఆపరేషనల్ లాజిస్టిక్స్
- ప్రాజెక్ట్ అవకాశాలు
నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్‌లో ప్రాజెక్ట్-ఆధారిత ఇంటర్న్‌షిప్‌ల నుంచి విద్యార్థులు ఎంచుకోవచ్చు. అందుబాటులో ఉన్న రోల్స్:
- AI , మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్
- పెద్ద భాషా నమూనాల కోసం AI ఇంజనీర్
- AI-ఆధారిత లీగల్ డాక్యుమెంట్ జెనరేటర్
- డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ డెవలపర్
- డేటా అనలిస్ట్ ఇంటర్న్
- సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంటర్న్
- మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ ఇంటర్న్
- రోబోటిక్స్ రీసెర్చ్ ఇంటర్న్
- డ్రోన్,చ UAV సాంకేతిక పరిశోధన
- స్పేస్ డొమైన్ అవేర్నెస్ ప్రాజెక్టులు
- SAP ERP టెక్నాలజీ ఇంటర్న్‌షిప్
- జోహో అనలిటిక్స్ డాష్‌బోర్డ్ డెవలపర్
- లీగల్ ఆటోమేషన్ ప్రాజెక్టులు
- ఫినాన్స్ ఆపరేషన్ సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్
ఒక్కో రకం ప్రాజెక్ట్‌కు అప్లికేషన్ తేదీలు వేర్వేరుగా ఉన్నాయి. 2026 ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 తో గడువు ముగుస్తుంది, అయితే కొన్ని ఖాళీలకు ఇప్పటికే గడువు ముగిసింది.
ఎలా దరఖాస్తు చేయాలి
విద్యార్థులు AICTE ఇంటర్న్‌షిప్ పోర్టల్ ద్వారా వివిధ ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, ఒకసారి ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఆఫర్‌ను మాత్రమే అంగీకరించాల్సి ఉంటుంది.
ఇంటర్న్‌షిప్ తో ఉద్యోగం వస్తుందా?
లేదు, ఎందుకంటే ఇంటర్న్‌షిప్ కార్యక్రమం కేవలం ప్రాక్టికల్ ఎక్స్ పీరియెన్స్ కోసం ఉద్దేశించినది మాత్రమేనని భారత సైన్యం స్పష్టం చేసింది. ఇంటర్న్‌షిప్ తర్వాత ఉద్యోగ నియామకానికి గానీ, హామీతో కూడిన ఉద్యోగానికి గానీ ఎలాంటి అవకాశం ఉండదు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారందరికీ పూర్తి చేసినట్లుగా ఒక సర్టిఫికేట్ లభిస్తుంది. డిఫెన్స్ ఎక్స్ పర్ట్స్ నుంచి డెవలపింగ్ టెక్నాలజీ, డిజిటల్ కమ్యూనికేషన్ , దేశ భద్రత గురించి నేర్చుకునే అవకాశం కలుగుతుంది.
