ఆధ్యాత్మికం: శ్రావణం మాసం ప్రారంభం.. ఆగస్టులో పండుగలు.. ప్రాధాన్యత గల రోజులివే...!

ఆధ్యాత్మికం:  శ్రావణం మాసం ప్రారంభం.. ఆగస్టులో పండుగలు.. ప్రాధాన్యత గల రోజులివే...!

విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నారు. కొంతమంది మఠాధిపతులు.. సన్యాశులు.. మొదలగు వారు చాతుర్మాస దీక్షలో చేస్తున్నారు.  2026 ఆగస్టు నెల ప్రారంభమైంది.  ఈ నెలలో కొత్తగా అమ్మవారికి ఇష్టమైన శ్రావణం రాబోతుంది.  శ్రావణమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది. ఆగస్టు నెలలో ఏఏ పండుగలు ఉన్నాయి.. ఏఏ తేదీలకు ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

 ఆగస్టు నెలలో  సంకష్టహర చతుర్థి, కామికా ఏకాదశి, మాస శివరాత్రి, చుక్కల అమావాస్య, శ్రావణమాసం ప్రారంభం, మొదటి శ్రావణ శుక్రవారం, స్వాతంత్ర్య దినోత్సవం, దుర్వా గణపతి వ్రతం, నాగపంచమి, మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, శ్రావణ పుత్రద ఏకాదశి, రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి), సంకటహర చతుర్థి వంటి ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి. ఈ నెలలో శివుడు, మహావిష్ణువు, మహాలక్ష్మీ దేవిని ఆరాధించడం  వలన విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. 


2026 ఆగస్టు నెల తెలుగు పంచాంగం ప్రకారం ఎన్నో పవిత్రమైన పండుగలు, వ్రతాలు, ఆధ్యాత్మిక విశేషాలతో నిండి ఉంది. ఈ నెలలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే అనేక వ్రతాలు, దేవతా జయంతులు, ఆలయ ఉత్సవాలు జరగనున్నాయి.  ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసమని పండితులు చెబుతున్నారు.

ఆగస్టు నెలలో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు

  •  ఆగస్టు 2 :  సంకటహర చతుర్థి
  •   ఆగస్టు 9 :  కామికా ఏకాదశి
  •   ఆగస్టు 10  :  ప్రదోష వ్రతం
  •   ఆగస్టు 11 :   మాస శివరాత్రి  
  • ఆగస్టు 12 :  చుక్కల అమావాస్య, సూర్యగ్రహణం ( భారతదేశంలో కనపడదు)
  • ఆగస్టు 13 :  శ్రావణమాసం ప్రారంభం 
  •   ఆగస్టు 15  :  భారత స్వాతంత్ర్య దినోత్సవం
  • ఆగస్టు 16 :  దూర్వాగణపతి వ్రతం
  • ఆగస్టు 17  :   గరుడ పంచమి, నాగ పంచమి, కల్కి జయంతి
  • ఆగస్టు 18 :  మంగళగౌరీ వ్రతం
  •  ఆగస్టు 21  :  వరలక్ష్మీ వ్రతం (సకల ఐశ్వర్యాలు, సౌభాగ్యాన్ని ప్రసాదించే పవిత్ర వ్రతంగా భావిస్తారు.)
  •   ఆగస్టు 22  :  తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభo
  • ఆగస్టు 23 :  శ్రావణ పుత్రదా ఏకాదశఙ
  •   ఆగస్టు 26  :  తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల ముగింపు, ఓనం పండుగ
  •   ఆగస్టు 28  :  జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి
  •   ఆగస్టు 30  :  శ్రావణ పౌర్ణమి, పుబ్బ కార్తె
  •   ఆగస్టు 31 :  సంకటహర చతుర్థి

ఆధ్యాత్మికంగా విశేషమైన నెల

శ్రావణ మాసంలో ఉపవాసాలు, శివారాధన, లక్ష్మీ పూజలు, నాగదేవత ఆరాధన, విష్ణు పూజలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ నెలలో వచ్చే ప్రతి వ్రతం, పండుగకు ప్రత్యేక ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. అలాగే తిరుమలలో జరిగే పవిత్రోత్సవాలు, తెప్పోత్సవాలు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. ఆధ్యాత్మిక సంప్రదాయాలను పాటిస్తూ, ఈ పవిత్రమైన పండుగలు, వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించడం ద్వారా దైవానుగ్రహం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు