సంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత: వట్ పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి, ఫర్నిచర్ ధ్వంసం

సంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత: వట్ పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి, ఫర్నిచర్ ధ్వంసం

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వట్ పల్లి మండలం పోలీస్ స్టేషన్‌పై దరఖాస్తుపల్లి గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. స్టేషన్‌లోని అద్దాలు, ఫర్నిచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు.

దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప అనే వ్యక్తి స్థానిక డాబాలో పనిచేస్తున్నాడు. ఆగస్టు 1 శనివారం ఉదయం ఆ దాబా వెనకాలే అతను ఉరివేసుకుని ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే తమకు సమాచారం ఇవ్వకుండానే పోలీసులు మృతదేహాన్ని కిందకు దించారని మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు.

Also Read : హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో టోకరా

తొలుత మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున దాబా వద్దకు చేరుకుని నిరసనకు దిగగా.. పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫర్నిచర్‌తో పాటు అక్కడ ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.