T20 World Cup 2028: టీ20 వరల్డ్ కప్ 2026లో లీగ్ మ్యాచ్ లు కంప్లీట్ కావడంతో పాటు సూపర్–8కి చేరిన జట్లు ఖరారవడంతో.. 2028లో జరిగే టీ20 ప్రపంచ కప్ 2028కు నేరుగా అర్హత సాధించిన జట్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది. 2028 టీ20 వరల్డ్ కప్‌కు సహ-ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా– న్యూజిలాండ్ కు ఇప్పటికే నేరుగా అర్హత సాధించినప్పటికీ.. ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్‌లో సూపర్–8కి చేరిన టీమ్స్ ఈ జాబితాలోకి వచ్చాయి.
సూపర్–8 ద్వారా అర్హత సాధించిన జట్లు:
* భారతదేశం
* దక్షిణాఫ్రికా
* జింబాబ్వే
* వెస్టిండీస్
* ఇంగ్లాండ్
* పాకిస్తాన్
* శ్రీలంక
ఇవే కాకుండా, ఐసీసీ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ జట్లు కూడా నేరుగా 2028 వరల్డ్ కప్‌కు అర్హత సాధించనున్నాయి. ఈ మూడు జట్ల పేర్లను 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 9వ తేదీ నాటికి ఐసీసీ పురుషుల టీ20 జట్ల ర్యాంకింగ్స్ ఆధారంగా చివరి మూడు టీమ్స్ అర్హతపై ఐసీసీ నిర్ణయం తీసుకోననుంది. ప్రస్తుత ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపించే అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకపోవడంతో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ ఈ స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది.
మిగతా జట్లు ఎలా ఎంపిక అవుతాయి?:
మొత్తంగా 2028 టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే మిగిలిన 8 జట్లు క్వాలిఫయర్ టోర్నమెంట్‌ల ద్వారా సెలక్ట్ అవుతాయి. ఈ క్వాలిఫయర్ మ్యాచ్‌లు వచ్చే రెండు సంవత్సరాల్లో జరగనున్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్ సూపర్–8 దశతోనే 2028 వరల్డ్ కప్‌కు ఆడే జట్లు ఖరారు అవుతాయి.
