T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ దశ ముగియడంతో పాటు మెగా టోర్నమెంట్ నుంచి ఆస్ట్రేలియా జట్టు నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ మాత్రం అజేయంగా సూపర్–8 దశకు అర్హత సాధించింది. , టోర్నీలో కీలకమైన సూపర్–8 రౌండ్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ICC అధికారికంగా రిలీజ్ చేసింది. ఇప్పుడు అసలు పోరు ప్రారంభం కానుంది. సూపర్–8 దశలో ఎనిమిది జట్లను రెండు గ్రూప్స్ గా విభజించబడ్డాయి. గ్రూప్–1లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో పాటు జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఉండగా.. మరోవైపు గ్రూప్–2లో శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.
సూపర్–8 గ్రూపులు:
గ్రూప్ 1:
భారత్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్
గ్రూప్ 2:
శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్
సూపర్–8 దశ కొత్తగా మొదలవుతుంది. గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు లేదా నెట్ రన్‌రేట్ ఇక్కడికి వర్క్ చేయదు. ప్రతి జట్టు జీరో నుంచి మళ్లీ టోర్నీలో పాల్గొనాల్సిందే. ప్రతి గ్రూప్‌లో సింగిల్ రౌండ్ రాబిన్ విధానంలో మ్యాచ్‌లు జరుగుతాయి. అంటే ప్రతి జట్టు మూడేసి మ్యాచ్‌లు ఆ గ్రూప్ లోని టీమ్స్ తో ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లు పూర్తయ్యాక, ప్రతి గ్రూప్ నుంచి టాప్–2 జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. అందుకే సూపర్–8లో ప్రతి రన్, ప్రతి వికెట్ కీలకంగా మారనుంది.
హై వోల్టేజ్ మ్యాచ్‌లు:
సూపర్–8 పోరు ఫిబ్రవరి 21వ తేదీన న్యూజిలాండ్ – పాకిస్థాన్ మధ్య కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ప్రారంభమవుతుంది. భారత అభిమానులకు ఫిబ్రవరి 22వ తేదీన మ్యాచ్ ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 26న జింబాబ్వేతో టీమిండియా మ్యాచులు జరగనున్నాయి. మార్చి 1వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ – వెస్టిండీస్ మధ్య జరిగే చివరి మ్యాచ్‌తో సూపర్–8 దశకు తెర పడనుంది.
‘పాక్ క్లాజ్’ ప్రత్యేక నిబంధన:
ఐసీసీ ఒక ప్రత్యేక నిబంధనను ప్రకటించింది. సెమీఫైనల్స్ కోల్‌కతా, ముంబైలో, ఫైనల్ అహ్మదాబాద్‌లో జరగనుంది. కానీ పాకిస్థాన్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఆ మ్యాచ్‌ను శ్రీలంకలోని కొలంబో (ఆర్. ప్రేమదాస స్టేడియం)కి మార్చే ఛాన్స్ ఉంది. ఇది హోస్ట్ దేశాల మధ్య ఉన్న పరిపాలనా ఒప్పందాల కారణంగా తీసుకున్న నిర్ణయం.
సూపర్–8 పూర్తి షెడ్యూల్:
* ఫిబ్రవరి 21: న్యూజిలాండ్ vs పాకిస్థాన్ – సాయంత్రం 7:00 – (కొలంబో)
* ఫిబ్రవరి 22: ఇంగ్లాండ్ vs శ్రీలంక – మధ్యాహ్నం 3:00 – (కాండీ)
* ఫిబ్రవరి 22: భారత్ vs దక్షిణాఫ్రికా – సాయంత్రం 7:00 – (అహ్మదాబాద్)
* ఫిబ్రవరి 23: జింబాబ్వే vs వెస్టిండీస్ – సాయంత్రం 7:00 – (ముంబై)
* ఫిబ్రవరి 24: ఇంగ్లాండ్ vs పాకిస్థాన్ – సాయంత్రం 7:00 – (కాండీ)
* ఫిబ్రవరి 25: న్యూజిలాండ్ vs శ్రీలంక – సాయంత్రం 7:00 – (కొలంబో)
* ఫిబ్రవరి 26: వెస్టిండీస్ vs దక్షిణాఫ్రికా – మధ్యాహ్నం 3:00 – (అహ్మదాబాద్)
* ఫిబ్రవరి 26: భారత్ vs జింబాబ్వే – సాయంత్రం 7:00 – (చెన్నై)
* ఫిబ్రవరి 27: ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ – సాయంత్రం 7:00 – (కొలంబో)
* ఫిబ్రవరి 28: పాకిస్థాన్ vs శ్రీలంక – సాయంత్రం 7:00 – (కాండీ)
* మార్చి 1: జింబాబ్వే vs దక్షిణాఫ్రికా – మధ్యాహ్నం 3:00 – (న్యూఢిల్లీ)
* మార్చి 1: భారత్ vs వెస్టిండీస్ – సాయంత్రం 7:00 – (కోల్‌కతా)
