హైదరాబాద్ లో వెతికే కొద్ది డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. న్యూ ఇయర్ కోసం ముందస్తుగా డ్రగ్స్ ను డంప్ చేసినట్లు గుర్తించిన పోలీసులు వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల డ్రగ్స్ బయటపడగా.. శనివారం (డిసెంబర్ 27) మరోసారి కుత్బుల్లాపూర్ పరిధిలో సురారం పోలీసులు భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు.
పోలీసులు తనిఖీల్లో MDMA, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న MDMA విలువ రూ.12.20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. 45 గ్రాముల బ్రౌన్ MDMA, 6 గ్రాముల వైట్ MDMA స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా13 గ్రాముల డ్రై గంజాయి సీజ్ చేశారు పోలీసులు.
►ALSO READ | హైదరాబాద్లో పట్టుబడ్డ నైజీరియన్ డ్రగ్స్ ముఠా.. రకుల్ ప్రీత్ బ్రదర్కు అమ్మినట్లు విచారణలో వెల్లడి
డ్రగ్స్ డంప్ చేసిన 9 మంది నిందితులను గుర్తించిన పోలీసులు.. అందులో 8 మందిని అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. ప్రధాన సరఫరాదారు అశ్విన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. డ్రగ్స్ తరలింపుకు రెండు కార్లు వినియోగించినట్లు గుర్తించారు.
