హైదరాబాద్లో పట్టుబడ్డ నైజీరియన్ డ్రగ్స్ ముఠా.. రకుల్ ప్రీత్ బ్రదర్కు అమ్మినట్లు విచారణలో వెల్లడి

హైదరాబాద్లో పట్టుబడ్డ నైజీరియన్ డ్రగ్స్ ముఠా.. రకుల్ ప్రీత్ బ్రదర్కు అమ్మినట్లు విచారణలో వెల్లడి

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ టీం, వెస్ట్ జోన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. శనివారం (డిసెంబర్ 27) మాసబ్ ట్యాంక్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో నైజీరియా ముఠా డ్రగ్స్తో పట్టుబడింది. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.                                                                                                                                                                                                                                            
రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్కు డ్రగ్స్ సప్లై చేసినట్లు చెప్పిన ముఠా అంగీకరించింది. అమన్ ప్రీత్ సింగ్ ఐదుసార్లు డ్రగ్ సేవించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అమన్  పరారీలో ఉన్నాడని ఈ సందర్భంగా  వెస్ట్ జోన్ DCP శ్రీనివాస్ తెలిపారు.   అమన్ కోసం. రెండు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.  నిందితుల నుంచి కొకైన్, MDMA డ్రగ్ సీజ్ చేసినట్లు చెప్పారు.

►ALSO READ | హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. పట్టుబడిన వారిలో ప్రముఖ ఆసుపత్రి డాక్టర్లు..?

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అలర్ట్ గా ఉన్నట్లు చెప్పారు డీసీపీ శ్రీనివాస్. పబ్స్ పై నిఘా పటిష్టం చేసినట్లు తెలిపారు. వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న  పబ్బుల్లో డ్రగ్స్ , గంజాయి పై అలర్ట్స్ ఇచ్చామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి డ్రగ్స్ సేవించినా, సప్లై చేసినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.