హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. పట్టుబడిన వారిలో ప్రముఖ ఆసుపత్రి డాక్టర్లు..?

హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. పట్టుబడిన వారిలో ప్రముఖ ఆసుపత్రి డాక్టర్లు..?

పోలీసులు ఎంత నిఘా ఉంచినా.. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్ రవాణా చేస్తూనే ఉన్నారు కొందరు. వేడుకల్లో డ్రగ్స్ వినియోగానికి డిమాండ్ ఉంటుందని భావించి.. అక్రమ మార్గంలో డ్రగ్స్ ను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం (డిసెంబర్ 26) హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. 

ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్స్, 5 గురు వినియోగదారులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో మల్లారెడ్డి ఆసుపత్రిలో పని చేసే ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం. ఓ ప్రైవేట్ పాఠశాల వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా  8 మందిని  అదుపులోకి తీసుకున్నారు మేడ్చల్ ఎస్ ఓ టీ పోలీసులు.

నిందితుల నుంచి రూ. 4 లక్షల విలువ చేసే 70గ్రాముల MDMA డ్రగ్ , రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. న్యూ  ఇయర్ వేడుకల  కోసం, పార్టీలు చేసుకునేందుకు బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్  రవాణ  చేస్తుండగా పట్టుకున్నారు మేడ్చల్ ఎస్ ఓ టి పోలీసులు.

►ALSO READ | తప్పతాగి తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై.. కారులో సామూహిక అత్యాచారం.. నిందితుల్లో ఈ మహిళ కూడా..!