మహాశివరాత్రి:  శుభాకాంక్షలు ఇలా తెలపండి.. బెస్ట్ విషెస్ ను ఇలా పంచుకోండి..! 

మహాశివరాత్రి:  శుభాకాంక్షలు ఇలా తెలపండి.. బెస్ట్ విషెస్ ను ఇలా పంచుకోండి..! 

మహాశివరాత్రి  శివుడు ... పార్వతి దేవి వివాహాన్ని జరుపుకునే ఒక  పండుగ. ఈ సంవత్సరం, మహాశివరాత్రి ఫిబ్రవరి 15న వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలలో మహాశివరాత్రికి సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. భక్తులు శివాలయాలలో  పూజలు చేస్తారు. ఈ ప్రత్యేక రోజున బంధువులకు.. మిత్రులకు  శుభాకాంక్షలు తెలిపేందుకు బెస్ట్​ విషెస్​..!

  • మహా శివుడి అనుగ్రహం మీపై మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ మీ కుటుంబ సభ్యులందరికీ  మహాశివరాత్రి శుభాకాంక్షలు..
  •  ఓం నమః శివాయ అని జపించండి.. జీవితం అనే  పడవ ... సముద్రాన్ని ఈజీగా దాటుతుంది. మీకు.. మీ కుటుంబసభ్యులకు.. పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ .. మహాశివరాత్రి శుభాకాంక్షలు.
  •  ఏమీ అర్థం కాని వారికి పూర్ణ లింగేశ్వరం..అంతో ఇంతో తెలిసిన వారికి అర్ధనారీశ్వరం..శరణాగతి అన్న వారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం...మీ అందరకీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
  • ఈ ప్రత్యేకమైన రోజు నుంచి మీకు అన్నీ శుభాలే కలగాలని కోరుతూ ..మీకు..మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు
  • మహాశివరాత్రి సందర్భంగా మీ జీవితంలో కొత్త వెలుగు నిండాలని.. మానసిక ప్రశాంతతతో జీవితం ముందుకు సాగించాలని కోరుకుంటూ.. మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు 
  • హర హర మహదేవ శంబో శంకర.. ఇహపరముల నేలే జయ జగదీశ్వర.. కోరిన వారి కోరికలన్నీ తీర్చే ఈశ్వరుడి చల్లని దీవెనలు ..ఎల్లవేళలా మీకు అందాలని కోరుకుంటూ  .....మహా శివరాత్రి శుభాకాంక్షలు
  • ఒక పుష్పం, ఒక బిల్వపత్రం, ఒక కలశం నీరు, భోళా శివుడికి ఇవి సమర్పిస్తే చాలు, అతడు మిమ్మల్ని రక్షిస్తాడు.. మీకు అన్ని విధాలుగా శుభం జరగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ.. మీకు ..మహాశివరాత్రి శుభాకాంక్షలు!
  • శివయ్య లేని చోటు లేదు.. , మీ మనసులో, నా మనసులో, మన అందరి మనస్సులో ఆయన కొలువై ఉన్నాడు. ఈ శివరాత్రి రోజు ఆ పరమేశ్వరుని  ప్రేమకు మీరు పాత్రలు కావాలని ఆశిస్తూ, మహాశివరాత్రి  శుభాకాంక్షలు.
  •  మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండటం వలన మీ పాపాలు తొలగిపోవాలని ..  మీకు మోక్షం కలగాలని కోరుకుంటూ మీకు.. మీకుటుంబ సభ్యులకు  మహాశివరాత్రి శుభాకాంక్షలు! 

►ALSO READ | మహా శివరాత్రి రోజు ఏం చేయాలి.. ఎలా చేయాలి.. జాగరణ విధానం ఏంటీ.. ఏం తినాలి.. ఏం తినకూడదు..!