ప్రెగ్నెంట్ చేసినోడు.. DNAలో దొరికిండు.. 17 మందికి టెస్ట్ చేస్తే మూగ ‘తల్లి’ని చేసింది కన్న తండ్రే !

ప్రెగ్నెంట్ చేసినోడు.. DNAలో దొరికిండు.. 17 మందికి టెస్ట్ చేస్తే మూగ ‘తల్లి’ని చేసింది కన్న తండ్రే !

ఇతరులు చెప్పేది వినలేదు.. ఇతరులతో మాట్లాడలేదు. ఏదైనా సైగల ద్వారానే. అలాంటి చెవిటి, మూగ దివ్యాంగురాలి అత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా సంచలనగా మారింది. ఆమె గర్భం దాల్చిన తర్వాత పోలీసుల దృష్టికి వెళ్లిన ఈ కేసులో.. 17 మంది అనుమానితులపై చేసిన దర్యాప్తులో బయటపడ్డ నిజాలు షాకింగ్ కు గురిచేస్తున్నాయి. దీనిపై పోలీసులకే ఏం మాట్లాడాలో, మీడియాకు ఏం చెప్పాలో తెలియని పరస్థితి.  మైండ్ బ్లాక్ అయ్యే ఈ అత్యాచార మిస్టరీ గురించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ముంబైలో 20 ఏళ్ల యువతిపై జరిగిన కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో 17 మందికి డీఎన్ఏ (DNA) టెస్టులు చేయగా అందులో 17 ఏళ్ల బాలుడు కూడా ఉండటం గమనార్హం. ఇందులో ట్విస్టు ఏంటంటే.. ఆమె తండ్రి డీఎన్ఏ కూడా పరీక్షించడం.. కడుపులో పెరుగుతున్న పసిగుడ్డు డీఎన్ఏతో తండ్రిది మ్యాచ్ కావడం. 17 మంది శాంపుల్స్ పరీక్షించిన తర్వాత తండ్రిని అరెస్టు చేశారు పోలీసులు.

ఏం జరిగింది..?

2025 సెప్టెంబర్ నెలలో తన కడుపులో ఏవో పురుగులో పాములో తిరుగుతున్నట్లుందని సదరు యువతి సైగల ద్వారా తన నానమ్మకు చెప్పుకుంది.  దీంతో సిటీలోని కామ అండ్ అల్బ్ బ్లెస్ హాస్పిటల్ అడ్మిట్ చేయగా.. ఆమె అప్పటికే 5 నెలల గర్భవతి అని డాక్టర్లు కన్ఫమ్ చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది హాస్పిటల్ యాజమాన్యం.

దర్యాప్తులో ఎన్నో సమస్యలు:

బాధితురాలు చెవిటి, మూగ దివ్యాంగురాలు కావటంతో దర్యాప్తు చాలా ఇబ్బందికరంగా మారినట్లు పోలీసులు తెలిపారు. చెప్పింది అర్థం చేసుకోలేదు.. చెప్పలేదు.. తనకు జరిగిన దారుణంపై స్టేట్ మెంట్ ఇవ్వలేదు.. ఇలాంటి పరిస్థితుల్లో.. తండ్రిని సహాయం అడిగితే తన కూతురిపై అత్యాచారాన్ని కొట్టివేయటమే కాకుండా.. అలాంటివేమీ లేదని దర్యాప్తుకు సహకరించలేదట. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని అడిగితే కూడా తిరస్కరించాడట. ఆ తర్వాత బాధితురాలిని ఒప్పించి క్లప్లైంట్ ఇప్పించినట్లు చెప్పారు. 

►ALSO READ | షాకింగ్ వీడియో: కార్ను ఫుల్ రేజ్ చేస్తూ మహిళపైకి ఎక్కించేందుకు ఎలా వెంటాడాడో చూడండి

ఆమె ఇచ్చిన ప్రాథమిక సమాచారంతో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. అందులో ఒక వ్యక్తి 17 ఏళ్ల మైనర్ బాలుడు. ఇందులో మొత్తం 17 మంది డీఎన్ఏ లను పరీక్షించగా.. చివరికి రేపిస్ట్ ఎవరో తేల్చారు. జనవరి 27న వచ్చిన రిపోర్టులో 17 మందిలో ఒకే ఒక పాజిటివ్ కేసును గుర్తించారు. అది ఆ యువతి తండ్రిది కావడం నిర్ఘాంతపోయే విషయం. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. యువతిపై అత్యాచారం 2025 మార్చి నుంచి సెప్టెంబర్ 21 మధ్య కాలంలో జరిగినట్లు తెలిపారు. సెప్టెంబర్ 22న కేసు నమోదైంది. ఈ దారుణాతి దారుణమైన ఘటనపై ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి కేసులలో చట్టం తనపని తాను చేసుకుపోవడమే కాకుండా.. ఇలాంటి కీచక, రాక్షస తండ్రులు మళ్లీ పుట్టకుండా చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.