క్రైమ్ సీన్స్ చూడాలంటే సినిమాలు చూడాల్సిన పనిలేదు.. డైలీ మన చుట్టే జరుగుతున్నాయి.. అని పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ప్రస్తుత సమాజంలో ఒక్కొక్కరు ఎలా తెగబడుతున్నారంటే.. పోలీసులు అంటే భయం లేదు.. చట్టం అంటే గౌరవం లేదు.. కోర్టులు, శిక్షలు, జైళ్లు... ఇలాంటి భయాలు, ఆలోచనలు ఏమీ లేకుండా ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో ఒక మహిళపై కారు ఎక్కించేందుకు ఈ వ్యక్తి చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక 29 ఏళ్ల వ్యక్తి.. మహిళపైకి కారు ఎక్కించి చంపేందుకు చేసిన ప్రయత్నం సీసీటీవీలో రికారర్డయ్యింది. విజువల్స్ చూస్తుంటే భయాందోళన కలగక మానదు. ఈ ఘటనపై ఒషివారా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
నవరాష్ట్ర డాట్ కామ్ (Navarashtra.com) షేర్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ భయాందోళనలకు గురిచేస్తోంది. లోఖంద్వాలా లోని ఎరీనా బిల్డింగ్ ముందు రాత్రి 9.30 ప్రాంతంలో ఒక మహిళను చంపేందుకు ప్రయత్నం చేశాడు ఒక వ్యక్తి. బిల్డింగ్ దగ్గరకు వచ్చిన కారు.. వెంటనే ఫుల్ రేస్ చేస్తూ సడెన్ గా మహిళ ను ఢీకొట్టేందుకు ప్రయత్నించింది. కారు పొగలు కక్కుకునేలా రేజ్ చేస్తూ మహళపైకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేసి.. చివరికి గేట్లు మూసివేయడంతో ప్రమాదం తప్పింది.
मुंबईच्या लोखंडवाला परिसरात धक्कादायक प्रकार घडला. ॲसिड अटॅकची धमकी दिल्यानंतर एका व्यक्तीने थेट मॉडेलच्या अंगावर कार घालण्याचा प्रयत्न केला. ही घटना CCTV मध्ये कैद झाली असून आरोपीविरोधात गुन्हा दाखल करण्यात आला आहे.#MumbaiCrime #Lokhandwala #BreakingNews #CCTVFootage #CrimeNews pic.twitter.com/U5rfPofT4T
— Navarashtra (@navarashtra) February 4, 2026
ఏం జరిగింది..?
మహమ్మద్ షేఖ్ అనే వ్యక్తి గత 9 నెలలుగా ఒక మహిళపై పుకార్లు పుట్టిస్తున్నాడు. వృత్తిరీత్యా మోడల్ అయిన మహిళపై లేని పోని రూమర్స్ స్ప్రెడ్ చేయడంతో ఇద్దరి మధ్య గతంలో వాదోపవాదాలు జరిగాయి. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం ఆమె తన ఫ్రెండ్ తో కలిసి నిందితుని ఇంటికెళ్లింది. పుకార్లపై నిలదీసేందుకు వెళ్లిన ఆమెను చూసిన ఆ వ్యక్తి డోర్స్ ఓపెన్ చేయలేదు. వెళ్లిన ఇద్దరు అమ్మాయిలు అతని పేరు పెట్టి పిలిచినా బయటకు రాలేదు.
ఆ మరుసటి రోజే బాధితురాలి ఫ్రెండ్ కు థ్రెట్ మెసేజ్ పంపిచాడు నిందితుడు. మీ ఫ్రెండ్ పై యాసిడ్ అటాక్ చేస్తానని స్నాప్ చాట్ లో మెసేజ్ చేశాడు. ఆ మరుసటి రోజే ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగా ఆమెను కారుతో ఢీకొట్టే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ జరుపతున్నాట్లు చెప్పారు.
