ఇలాంటోళ్లు ఉంటే ఏంటి, పోతే ఏంటి..? రోడ్డుపై వ్యక్తి గిలగిలా కొట్టుకుంటుంటే వీళ్లు ఏం చేశారో చూడండి!

ఇలాంటోళ్లు ఉంటే ఏంటి, పోతే ఏంటి..? రోడ్డుపై వ్యక్తి గిలగిలా కొట్టుకుంటుంటే వీళ్లు ఏం చేశారో చూడండి!

మానవత్వం, పరోపకారం.. ఇలాంటి పదాలకు ఈ రోజుల్లో స్థానం లేదేమో అనిపిస్తుంటుంది కొన్ని ఘటనలు చూశాక. ఒక వ్యక్తి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే.. అన్నం తినే వాడు ఎవడైనా తన వంతుగా బతికించేందుకు ఏం చేయాలో ప్రయత్నిస్తాడు. కానీ వీళ్లు చేసిన పనికి వాళ్లను ఏమనాలో.. ఏం చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన.. ప్రస్తుత సమాజంలో మానవ విలువల్లో వస్తున్న మార్పులు ఏంటో అద్దంపడుతోంది.

ఔటర్ ఢిల్లీ రన్హోలా ఏరియాలో.. శనివారం (జనవరి 31) రాత్రి జరిగిన ఈ ఘటన మానవ విలువలపై ఆందోళనకు గురిచేస్తోంది. రోడ్డుపై ఒక వ్యక్తి మతిస్థిమితం కోల్పోయిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుండగా.. దారిలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు.. సహాయం చేయడం మానేసి అక్కడ పడిఉన్న వస్తువులు తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన గురించి పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

ALSO READ : కరీంనగర్ రేకుర్తిలో పిల్లలకు విషమిచ్చిన తల్లి.. ఆమె కూడా చనిపోయింది !

వికాస్ నగర్ లో తెల్లవారుఝామున 4 గంటలకు ఈ ఘటన జరిగింది. హార్ట్ అటాక్ లేదా ఫిట్స్ వచ్చి రోడ్డుపైన ఒక వ్యక్తి గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఆ దారిలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల బైక్ ను ఆపారు. వ్యక్తి పరిస్థితి ఏంటని కూడా చూడకుండా అక్కడ పడి ఉన్న మొబైల్ తీసుకుని.. అంతటితో ఆగకుండా జేబులో ఏమున్నాయో వెతికి.. వెళ్లిపోయారు. ఆ తర్వాత వ్యక్తి చనిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ లో వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తుల ఫూటేజ్ వేరే సీసీ కెమెరాలో రికార్డయినట్లు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఉదయం 8 గంటలకు స్థానికులు అక్కడికి చేరుకుని సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. మనిషి చనిపోతున్న పరిస్థితుల్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.

ALSO READ : బర్త్ డే పేరుతో రోడ్లపై ఇట్ల జేస్తే జైలుకే..!

ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసిన చాలా మంది కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇదే న్యూ ఇండియా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మానవత్వం, జాతి, దయ, కరుణ, నిజాయితీ.. ఇలాంటి పదాలను పుస్తకాల్లో మాత్రమే చదువుకోవాలేమో అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన చూశాక జంతువులు కూడా సిగ్గుపడతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

ఇలాంటి ఘటనలు ఢిల్లీలో జరగటం ఇదే తొలిసారి కాదు. 2025 జనవరి 11 న కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. వికాస్ అనే ఒక ఉద్యోగి ఘితోర్ని ఏరియా దగ్గర బైక్ పై నుంచి కంట్రోల్ తప్పి పడిపోయాడు. సీసీటీవీ ఫూటేజ్ లో ముగ్గురు వ్యక్తులు సహాయం చేయకపోగా.. బైక్ దొంగిలించి పారిపోయారు. దొంగతనం చేసిన టెన్షన్ లో పారిపోతూ యాక్సిడెంట్ కు గురయ్యారు. అదే సమయంలో వికాస్ ను ఎవరూ గమనించకపోవడంతో.. తీవ్ర రక్తస్రావం జరిగి చలికి చనిపోయాడు.