బీసీలకు 70 మున్సిపల్ చైర్మన్లు, 4 మేయర్‌‌‌‌‌‌‌‌ పదవులు ఇవ్వాలి : బీసీ పొలిటికల్ ఫ్రంట్

బీసీలకు 70 మున్సిపల్ చైర్మన్లు, 4 మేయర్‌‌‌‌‌‌‌‌ పదవులు ఇవ్వాలి : బీసీ పొలిటికల్ ఫ్రంట్
  •     రాజకీయ పార్టీలకు బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్ 

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీల్లో 70 మున్సిపల్ చైర్మన్ పదవులు, 7 కార్పొరేషన్ పదవుల్లో 4 మేయర్ స్థానాలు బీసీలకు కేటాయించాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌‌‌‌లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అంబాల నారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు ఓట్లు వేసి గెలిపించిన బహుజనులకు అభినందనలు తెలిపారు. 70 మున్సిపల్ చైర్మన్ పదవులను, 4 మేయర్ స్థానాలు బీసీలకు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. 

రిజర్వేషన్ల పరంగా 31 శాతం బీసీలకు అవకాశం వచ్చినప్పటికీ, 48 శాతం జనరల్ స్థానాల్లో ఆధిపత్య కులాలతో పోటీపడి అత్యధిక స్థానాల్లో బీసీలు గెలుపొందారన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న మొత్తం మున్సిపల్‌‌‌‌ స్థానాల్లో 60 మున్సిపల్ చైర్మన్ పదవులు, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ 10 చైర్మన్ పదవులు బీసీలకు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు. మొత్తం 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన 5 మేయర్ స్థానాల్లో మూడు బీసీలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్.దుర్గయ్య గౌడ్, ఫ్రంట్ కన్వీనర్స్ బైరు శేఖర్  తదితరులు పాల్గొన్నారు.