మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చొరవతో  తాగునీటి సమస్యకు చెక్

మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చొరవతో  తాగునీటి సమస్యకు చెక్
  • మందమర్రి డబుల్​బెడ్​రూమ్ కాలనీలో రూ.50వేలతో 
  • కొత్త బోరుమోటారు ఏర్పాటు

 

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి చొరవతో మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీ వాసుల తాగునీటి సమస్య తీరింది. కాలనీలోని 1, 6, 7, 8 బ్లాకులకు తాగునీరు సప్లై బోరు మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనిచేయకపోవడంతో సుమారు 100 కుటుంబాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకుడు వడ్లూరి సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానిక నాయకులతో కలిసి మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామికి వివరించారు. స్పందించిన మంత్రి, కొత్త విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేయాలని మందమర్రి మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తుంగపిండి రాజలింగును ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు రూ.50 వేలతో కొత్త మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేసి సోమవారం కాలనీలో ఏర్పాటు చేశారు. దీంతో తాగునీటి సరఫరా పునరుద్ధరణ కావడంతో కాలనీవాసులు మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామికి, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎంఆర్ఎఫ్​ చెక్కుల పంపిణీ

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13 మంది లబ్ధిదారులకు రూ.5.52 లక్షల విలువైన సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి ఆదేశాల మేరకు సోమవారం రామకృష్ణాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ ఆఫీస్​లో టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వొడ్నాల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకులు మాట్లాడుతూ మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి సహకారంతో ఇప్పటివరకు 200 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. అత్యవసర వైద్య చికిత్స అవసరమైన వారికి ముందస్తుగా ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోసీలు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకులు పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, బత్తుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బత్తుల వేణు, నక్క శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సృజన, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.