హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ రేట్లు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల నుంచి చాలా ఫిర్యాదులొస్తున్నాయని, కామన్పాస్రేట్లపై సమీక్ష చేస్తామన్నారు.
‘ప్రస్తుతం డెయిలీ కామన్ పాస్ ధర రూ.400, నెలవారీ రేటు రూ.8,500 ఉన్నారు. కానీ, ఈ రేట్లు సామాన్యులకు భారంగా మారాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు ఈ ధరలను పున:పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నాం.’ అని మంత్రి స్పష్టం చేశారు.
