చి‘వరి’ ప్రయత్నంగా..పంట పొలాలకు ట్యాంకర్లతో వాటర్

చి‘వరి’ ప్రయత్నంగా..పంట పొలాలకు ట్యాంకర్లతో వాటర్

చేవెళ్ల/కోనరావుపేట, వెలుగు : ఓ వైపు వర్షాలు పడక భూగర్భ జలాలు అడుగంటడం, మరోవైపు కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు ట్యాంకర్లతో నీటిని అందిస్తుండగా, మరికొందరు జనరేటర్లు ఏర్పాటు చేసుకొని మోటార్లను నడిపిస్తున్నారు. 

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడకు చెందిన రైతు రాజుకు చెందిన బోరులో నీరు తగ్గిపోయింది. దీంతో రెండు ఎకరాల్లో సాగు చేసిన వరిని కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నాడు. ఒక్కో ట్యాంకర్ కు రూ. 1000 చొప్పున ఖర్చు చేసి నీటిని అందించినప్పటికీ మరో అరెకరం ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్లకు చెందిన ఆకుల చిన్న నారాయణ జనరేటర్ ఏర్పాటు చేసి మోటర్ ను నడిపిస్తూ పంటకు నీటిని అందిస్తున్నాడు. జనరేటర్ అద్దె, డీజిల్ కోసం భారీ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుందని రైతు వాపోయాడు.