ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ..నేడు (అక్టోబర్ 13) బీజేపీ కసరత్తు ..ఆశావహుల నుంచి అభిప్రాయ సేకరణ 

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ..నేడు (అక్టోబర్ 13) బీజేపీ కసరత్తు ..ఆశావహుల నుంచి అభిప్రాయ సేకరణ 

హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, నల్గొండ–ఖమ్మం-వరంగల్ స్థానాలకు ఆశావహుల నుంచి మంగళవారం అభిప్రాయాలు సేకరించనుంది. ఇందుకోసం ఒక్కో స్థానానికి ముగ్గురు సీనియర్ నేతలతో ప్రత్యేక కమిటీలను నియమించింది.

హైదరాబాద్–రంగారెడ్డి-మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ స్థానానికి బీజేపీ ఆఫీసులో అభిప్రాయ సేకరణ జరగనుంది. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నేతృత్వంలోని కమిటీలో కళ్యాణ్ నాయక్, వెంకటరమణి సభ్యులుగా ఉన్నారు. నల్గొండ–-ఖమ్మం–వరంగల్ స్థానానికి వరంగల్‌‌‌‌‌‌‌‌లో అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈ కమిటీలో భరత్ ప్రసాద్, గోలి మధుసూదన్ రెడ్డి, ఆంజనేయులు సభ్యులుగా ఉన్నారు.

ఈ నివేదికలను రాష్ట్ర నాయకత్వానికి అందజేస్తాయి. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నేతృత్వంలోని స్టేట్ కోర్ కమిటీ ఒక్కో స్థానానికి ముగ్గురి పేర్లతో షార్ట్‌‌‌‌‌‌‌‌లిస్ట్ తయారు చేసి జాతీయ నాయకత్వానికి పంపనుంది. చివరగా జాతీయ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో రెండు స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.