కరువుకు శాశ్వత పరిష్కారం..చతుర్విధ జల విధానం :మర్రి శశిధర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

కరువుకు శాశ్వత పరిష్కారం..చతుర్విధ జల విధానం :మర్రి శశిధర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • ఎకరాకు రూ.15 వేలతో అమలు చేయొచ్చు
  • ఎన్డీఎంఏ మాజీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: వాతావరణ మార్పులు, ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో పొంచి ఉన్న కరువును ఎదుర్కొనేందుకు శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టాలని ఎన్డీఎంఏ మాజీ ఉపాధ్యక్షుడు, డాక్టర్‌‌‌‌‌‌‌‌ ఎం. చెన్నారెడ్డి మెమోరియల్‌‌‌‌‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ కార్యదర్శి, బీజేపీ సీనియర్‌‌‌‌‌‌‌‌ నేత మర్రి శశిధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. దేశవ్యాప్తంగా చతుర్విధ జల విధానాన్ని (ఫోర్‌‌‌‌‌‌‌‌ వాటర్స్‌‌‌‌‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌) అమలు చేస్తే కరవును సమర్థంగా ఎదుర్కోవచ్చని చెప్పారు.

సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌ ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌, తెలంగాణలో వర్షాలు తగ్గుతున్నాయని తెలిపారు. దీంతో నీటి నిల్వలు అడుగంటిపోయి వ్యవసాయం దెబ్బతింటోందని చెప్పారు. దివంగత నీటిపారుదల నిపుణుడు టి. హనుమంతరావు రూపొందించిన చతుర్విధ జల విధానాన్ని 2001లో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అమలు చేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని శశిధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి వివరించారు.

సంగారెడ్డి జిల్లా గొట్టిగారిపల్లి గ్రామం వరుస కరవులను తట్టుకుని మూడు పంటలకు నీటిని అందించిందని తెలిపారు. రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లోనూ ఈ విధానాన్ని అమలు చేసినట్లు చెప్పారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాలను పెంచడం, నేలకోతను నివారించడం ఈ విధానం ప్రధాన ప్రయోజనాలని వివరించారు. కరవు సమయంలోనూ నీటి లభ్యతను పెంచవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఎకరాకు సుమారు రూ.15 వేల ఖర్చుతో ఈ విధానాన్ని అమలు చేయొచ్చన్నారు. వర్షాధార భూముల్లో దీన్ని విస్తరిస్తే రైతులకు నీటి భద్రత కల్పించవచ్చని, కరవు సహాయక చర్యలపై ప్రభుత్వ ఖర్చును కూడా తగ్గించవచ్చని శశిధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.