- ప్రైవేట్ కంపెనీల ద్వారా ఏర్పాటుకు ప్రయత్నాలు
- 2029లోగా పనులు పూర్తి చేయాలని షరతు
- యూనిట్ విద్యుత్‌కు రూ.4 లోపు చెల్లించేందుకు నిర్ణయం
- టెండర్లకు రెడీ అవుతున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు : గ్రీన్ ఎనర్జీలో భాగంగా రాష్ట్రంలో 800 మెగావాట్ల విండ్‌పవర్ ఉత్పత్తికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రైవేట్ కంపెనీల ద్వారా యూనిట్లు పెట్టించి, కరెంట్సేకరించేందుకు ఇప్పటికే కేబినెట్‌ఆమోద ముద్ర కూడా వేసింది.
ఒక మెగావాట్‌కు సుమారు రూ.7 కోట్ల చొప్పున మొత్తం రూ.5,600 కోట్లతో విండ్పవర్స్టేషన్ల ఏర్పాటుకు సర్కారు గ్రీన్సిగ్నల్ఇచ్చింది. 2029లోగా పనులు పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు రూ. 4 లోపు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు టెండర్లు పిలిచేందుకు విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 128 మెగావాట్ల విండ్‌పవర్ ఉత్పత్తి అవుతోంది.
నల్గొండ, మహబూబ్ నగర్ తో పాటు కర్నాటక బార్డర్ అనుకూలంగా..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ (ఎన్ఐడబ్ల్యూఈ) అంచనాల ప్రకారం తెలంగాణలో మంచి విండ్ పొటెన్షియల్ ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 128 మెగావాట్ల విండ్ పవర్ఉత్పత్తి అవుతోంది. నల్గొండ, మహబూబ్నగర్ఉమ్మడి జిల్లాల్లో విండ్స్పీడ్అత్యధికంగా ఉంది. కర్నాటక బార్డర్‌లోని ఏరియాలతో పాటు వికారాబాద్, నారాయణఖేడ్, కొడంగల్, తాండూర్, జహీరాబాద్ లు సైతం హై విండ్- డెన్సిటీ జోన్లుగా గుర్తించారు.
ఈ ఏరియాలో 100 మీటర్ల హబ్ హైట్ వద్ద సుమారు 4,240 మెగావాట్స్, 120 మీటర్ల వద్ద 24,835 మెగావాట్స్, 150 మీటర్ల వద్ద 54,717 మెగావాట్స్విండ్పవర్జనరేట్ చేయొచ్చని ఎన్ఐడబ్ల్యూఈ రిపోర్ట్ఇచ్చింది. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంల లో విండ్ స్పీడ్ తక్కువగా ఉందని రిపోర్ట్‌లో తెలిపారు.
తెలంగాణ రెడ్కో సహకారంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 139 విండ్ మానిటరింగ్ మాస్ట్‌లు ఏర్పాటు చేయగా, ప్రైవేట్డెవలపర్లు మరో 25 మాస్ట్‌లు ఏర్పాటు చేసి తయారు చేసిన నివేదికను సర్కార్ కు అందజేశారు.
యూనిట్ విద్యుత్ఖర్చు తక్కువే...
థర్మల్పవర్తో పోల్చి చూస్తే విండ్‌పవర్ చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న థర్మల్‌విద్యుత్ ను యూనిట్‌కు రూ.6 నుంచి 8 చొప్పున చెల్లించి డిస్కంలు కొనుగోలు చేస్తున్నాయి. సోలార్పవర్అయితే రూ.4 లోపే చెల్లిస్తున్నారు. గ్రీన్ఎనర్జీ పెంపులో భాగంగా విండ్పవర్పై సర్కారు ఫోకస్ చేసింది.
గుజరాత్వంటి రాష్ట్రాల్లో అక్కడి డిస్కంలు యూనిట్‌కు రూ.3.50లోపే చెల్లించి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా విండ్ పవర్జనరేషన్పెంచి యూనిట్‌కు రూ.4 లోపే చెల్లించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. 2029 నుంచి 25 ఏండ్ల పాటు విండ్పవర్కొనుగోలు చేయాలని ఇటీవల జరిగిన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది.
ప్రైవేట్ కంపెనీల ద్వారా కొనుగోలు
విండ్పవర్జనరేషన్ను ప్రభుత్వం నేరుగా చేపట్టకుండా ప్రైవేట్డెవలపర్ల నుంచి పవర్పర్చేజ్అగ్రిమెంట్ (పీపీఏ) ద్వారా విద్యుత్కొనేందుకు ఒప్పందాలు చేసుకోనుంది. ఈ మేరకు నోడల్ ఏజెన్సీగా రెడ్కో సంస్థను నియమించింది.
ఒక మెగావాట్‌కు సుమారు రూ.7 కోట్ల చొప్పున మొత్తం 800 మెగావాట్లకు రూ.5,600 కోట్ల పెట్టుబడులను ప్రైవేట్సంస్థలే సమకూర్చుకుంటాయి. సెంట్రల్ రెగ్యులేషన్స్ ప్రకారం కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా అగ్రిమెంట్జరగనుంది. ఈ మేరకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.
