- చిట్ చాట్ లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఎల్ నినో ప్రభావంతోనే తెలంగాణలో విద్యుత్ వాడకం పెరిగిందని, అందువల్లే కోతలు తప్పడం లేదని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన కౌన్సిల్ హాల్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. డిమాండ్ కు సరిపడా విద్యుత్ ఉత్పత్తి లేదన్నారు. ఈ బతుకమ్మ పండుగకు తంగేడు పూలు కూడా కరువు అయ్యాయని, ఖాళీ జాగ కనిపిస్తే ఏవో విత్తనాలు చల్లుతున్నారన్నారు.
సర్ పై పోరాటంతో రాహుల్ గాంధీ ఛరిష్మా పెరిగిందన్నారు. ఇదే సమయంలో బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. తన కుమారుడు అమిత్ ప్రత్యక్ష ఎన్నికల్లోనే పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. తాను మండలి ఛైర్మన్ గా ఉండగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఈతన కుమారుడు ఎందుకు పోటీ చేస్తారని, మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల రేస్ లో తాము లేమని స్పష్టం చేశారు.
