ముషీరాబాద్,వెలుగు : మైనార్టీ గురుకులాల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నాన్ టీచింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. దీనికి ఎంపీ ఆర్. కృష్ణయ్య హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో 206 మైనార్టీ గురుకులాల్లో పనిచేసే 30 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
నాలుగైదు నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. మైనార్టీ గురుకుల నాన్ టీచింగ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ ముసేన్ షరీఫ్, అబ్దుల్లా, అనంతయ్య,సి రాజేందర్, అల్లం యాదయ్య, మొరాజ్, మంగ, జయమ్మ,రఘుపతి పాల్గొన్నారు.
