రాహుల్ గాంధీకి మద్దతుగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి భారీ ర్యాలీ

రాహుల్ గాంధీకి మద్దతుగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి భారీ ర్యాలీ


మెదక్/ సంగారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమవారం సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐబీ గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్ నుంచి ఓల్డ్ బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అంబేద్కర్ చౌక్ వరకు సాగిన ర్యాలీలో నిర్మలా జగ్గారెడ్డితో పాటు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ బీజేపీ దొంగ ఓట్లతో అధికారంలోకి వస్తోందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని, సంగారెడ్డిలోనూ నిరసనలు ఉధృతం చేస్తామని
 స్పష్టం చేశారు.