విండీస్ వ్యూహాలను తిప్పికొట్టా.. నమన్ ధీర్ గొప్ప బౌలరవుతాడు: మీడియాతో అభిషేక్ ముచ్చట్లు

విండీస్ వ్యూహాలను తిప్పికొట్టా.. నమన్ ధీర్ గొప్ప బౌలరవుతాడు: మీడియాతో అభిషేక్ ముచ్చట్లు

ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: మూడో టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనను కట్టడి చేసేందుకు వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా ప్రణాళికలను అమలు చేసిందని టీమిండియా ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ అన్నాడు. అయితే వాటిని తాను సమర్థంగా తిప్పికొట్టానని చెప్పాడు. ‘ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టింది. నన్ను కట్టడి చేసేందుకు వారు ప్రత్యేకమైన ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యూహాలను పన్నారు. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేలో నా శైలికి తగ్గట్లు రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబట్టడానికి ప్రత్యర్థి స్ట్రాటజీ కంటే మెరుగ్గా ఆడాల్సి వచ్చింది.

 ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమరికను బట్టి గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వెతుక్కుంటూ షాట్లు ఆడాను. నేను కావాలని ఆలోచించి ఆడను. ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూసినప్పుడు అది సహజంగానే జరుగుతుంది. తగినంత ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొరికి బలమైన షాట్లు ఆడే అవకాశం ఉన్నప్పుడు బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝుళిపిస్తా’ అని అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైదాన పరిస్థితుల దృష్ట్యా విండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తలపడటం ఎప్పుడూ ప్రమాదమేనని చెప్పాడు. ‘విండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆడేటప్పుడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన చేతుల్లో ఉందని ధీమాగా ఉండలేము. ఏ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రీజులోకి వచ్చినా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తమ వైపు తిప్పుకోవడం వారికి చాలా సులభం. 

అందుకే ఈ విషయం మా మనసులో మెదులుతూనే ఉంటుంది. మేం వికెట్లు కోల్పోయినప్పుడు కూడా కఠినంగా ఆడాలని, వాళ్లకు ఎలాంటి చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వొద్దని అనుకున్నాం’ అని అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవడమే తన లక్ష్యమన్నాడు. ‘పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేలో రాణించాలంటే సన్నద్ధత చాలా ముఖ్యం. అదే విధానాన్ని నేను కొనసాగిస్తా. జట్టు ప్రణాళిక కూడా అదే. నాకు టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లభించినప్పుడల్లా నాపై వ్యూహరచన చేసే బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరు,  నా ప్రణాళికను ఎలా అమలు చేయాలి అనే అంశాలపై నిర్దిష్టంగా దృష్టి పెడతా’ అని అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పుకొచ్చాడు. 

నమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 

తన పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టు సహచరుడు నమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబోయే ఏళ్లలో ఇండియా తరఫున అద్భుతంగా రాణిస్తాడని అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కితాబిచ్చాడు. ‘అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–14 రోజుల నుంచి నేను అతన్ని చూస్తున్నా. కాబట్టి ధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంత బాగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగలడో నాకు తెలుసు. మనం అతనికి ప్రణాళిక వివరిస్తే చాలు దాన్ని కచ్చితంగా అమలు చేస్తాడు. వరుసగా రెండు సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కొట్టినప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా కచ్చితమైన ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయమని కోరాం. అతని బౌలింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే కచ్చితంగా గొప్ప బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాణిస్తాడనే నమ్మకం నాకు ఉంది.  ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చినప్పుడు చాలా సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాడన్నాడు.

 ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నవ్వించి కాస్త రిలాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యేలా చేయాలని చెప్పాడు. ‘ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చినప్పుడు ఒక రకమైన ఏకాగ్రతతో వస్తాడు. అదే జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండటానికి ఇష్టపడతాడు. కానీ మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా మేం చాలాసార్లు మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాం. పరస్పరం బాగా అర్థం చేసుకుంటాం. వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడిన వెంటనే క్రీజులోకి రావడం వల్ల సహజంగానే ఒత్తిడి ఉంటుంది. దాన్ని అతను సులువుగానే అధిగమిస్తాడు’ అని అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపాడు.