ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూకు 90 శాతం ఓట్లు రాలే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు పంచారు: మొగుళ్ల రాజిరెడ్డి

ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూకు 90 శాతం ఓట్లు రాలే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు పంచారు: మొగుళ్ల రాజిరెడ్డి

బషీర్‌‌బాగ్, వెలుగు : ఆర్టీసీ యూనియన్‌‌ ఎన్నికల్లో ఎంప్లాయీస్‌‌ యూనియన్‌‌ కూటమికి 90 శాతం ఓట్లు వచ్చాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని జలమండలి ఎంప్లాయీస్‌‌ యూనియన్‌‌ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి ఖండించారు. ఈయూ కూటమికి 52 శాతం, వర్కర్స్‌‌ యూనియన్‌‌ కూట మికి 48 శాతం ఓట్లు వచ్చాయన్నారు. 

బషీర్‌‌బాగ్‌‌ ప్రెస్‌‌క్లబ్‌‌లో టీఎంయూ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డితో కలిసి మాట్లాడుతూ  తమ కూటమికి 14 వేల ఓట్లు వచ్చాయని, కొన్ని డిపోల్లో రెండు, మూడు ఓట్ల స్వల్ప తేడాతో వెనుకబడ్డామన్నారు. 17న పోస్టల్‌‌ బ్యాలెట్ల లెక్కింపు జరగనుందని చెప్పారు. 

హైదరాబాద్‌‌ పరిధిలోని డిపోల్లో ఈయూ కూటమి తరఫున బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలకు తన వద్దఆధారాలున్నాయన్నారు. టీఎంయూ కూటమి నేతలు ఎం. శంకర్‌‌, ఎన్‌‌. దామోదర్‌‌రెడ్డి, ఎస్‌‌. శేఖర్‌‌రెడ్డి, పి.ఎస్‌‌. నారాయణ పాల్గొన్నారు .