నా దారి నాది.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో బరాబర్ పోటీ చేస్త : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నా దారి నాది.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో బరాబర్ పోటీ చేస్త : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  • కొత్త పార్టీ ఏర్పాటుపై అవగాహన కోసమే జనంబాట
  • నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు
  • సామాజిక తెలంగాణ భవిష్యత్ ఆయుధాన్ని
  • పాలమూరును ఆగం చేసింది హరీశ్ రావే

నాగర్ కర్నూల్: తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని, సామాజిక తెలంగాణ భవిష్యత్ ను ని ర్ణయించే ఆయుధాన్ని అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ బాగుండాలని కోరుకుంటే రోడ్డున పడేశారని, కనీసం సంజాయిషీ చెప్పుకునే అవకాశం ఇవ్వలేదని అన్నారు. రాజకీయ పార్టీ స్థాపించేందుకు అవగాహన కోసమే తెలంగాణ జాగృతిగా బాట పట్టినమన్నారు. అన్ని జిల్లాలు పర్యటిస్తానని, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిసీట్లలో బరాబర్ పోటీ చేస్తామని కుండ బద్దలు కొట్టారు. 

ఇవాళ (డిసెంబర్ 27) నాగర్ కర్నూల్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్ట్ సందర్శించిన కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. తాను నిజా మాబాద్ ఎంపీగా గెలిచినా ఎక్కడా తిరగలేని పరిస్థితి కల్పించిన శక్తులే రెండో సారి తనను ఓడించేందుకు కుట్ర చేశాయని ఆరోపించారు. కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్ పోటీ చేసి ఓడిపోయేంతగా పరిస్థితులు దిగజారాయని అన్నారు. పార్టీ అంతర్గత వేదికల్లో కూడా నోరు విప్పలేని పరిస్థితి ఉండేదన్నారు. బీఆర్ఎస్ బాగుండాలని కోరుకున్న తనను సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం లేకుండా సస్పెండ్ చేసి రోడ్డున పడేశారని అన్నారు. మూడు నెలలు సైలెంట్ గా ఉండమన్నారు. ఇవన్నీ భరించలేకే ఎమ్మెల్సీకి రిజైన్ చేసినట్లు తెలిపారు.

ఒకే టైంలో ముగ్గురితో పోరాడుతున్న

కమీషన్ల కోసం పాలమూరును ప్రాజెక్టును హరీష్ రావు పాడు చేసిండని ఆరోపించా రు. ఓపెన్ కట్ పంప్ హౌజ్ ను అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ గా మార్చాడని టన్నెల్ బ్లాస్టింగ్ తో కేఎల్ఎ లోని ఎల్లూరు మునిగిందని అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ లో 5 ఏండ్లుగా 3 మోటార్లు మాత్రమే పని చేస్తు న్నాయని అన్నారు. మిషన్ భగీరథ పథకం లింక్ చేసిన కేఎస్ఐ మూడు మోటార్లు సాగు, తాగునీటికీ దిక్కయ్యాయని ఆరో పించారు. 2023లో మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ప్రా జెక్టులో కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడుమట్టి తీయలేదని అన్నారు. కొడంగల్ లిఫ్ట్ కు రూ.2వేల కోట్లు నిధులిచ్చి మెగా కంపెనీ, పొంగులేటి కంపెనీలకు చెరో వెయ్యి కోట్లు అడ్వాన్స్కింద ఇచ్చారని ఆరోపించారు.

►ALSO READ | డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి: కలెక్టరేట్ల ముందు DJFT ధర్నా