ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. ఏ మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు గెలిచిందంటే..

ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. ఏ మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు గెలిచిందంటే..

ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కనిపించింది. ఖమ్మంలో 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ క్లీన్‌ స్వీప్ చేసింది. కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్తో పాటు ఏడు మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు జరిగింది.

* ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులకు గానూ ఇల్లందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 03, ఇండిపెండెంట్ 02  స్థానాల్లో విజయం సాధించారు.
    
* అశ్వారావుపేట మున్సిపాలిటీలో 22 వార్డులకు ఒకేసారి ఓట్లను లెక్కించారు. అగ్రికల్చర్​ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరిగింది. కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 2, బీజేపీ 1, ఇండిపెండెంట్లు ఇద్దరు విజయం సాధించారు. 16 వేల 850 మంది ఓటర్లకు12 వేల 839 ఓట్లు పోల్ అయ్యాయి. 
    
* ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ.. 24, సీపీఎం పార్టీ.. 02, సీపీఐ పార్టీ.. 03, టీఆర్ఎస్ పార్టీ.. 02, ఇండిపెండెంట్ ఒక  స్థానంలో గెలిచారు. ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
    
* వైరా మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 5, ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. 24 వేల 689 ఓటర్లకు 20 వేల 668 ఓట్లు పోల్ అయ్యాయి.
    
* కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 12 వార్డులు, బీఆర్ఎస్ 6, బీజేపీ 1, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు.
    
* మధిర మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 18 వార్డులు, బీఆర్ఎస్ ఒక వార్డులో, ఇతరులు మూడు వార్డుల్లో గెలిచారు.
    
* సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులు ఉండగా.. కాంగ్రెస్: 17 వార్డులు, బీఆర్ఎస్: 06 వార్డులు గెలుచుకున్నాయి.