చౌటుప్పల్ బృందావన్ ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్లు.. భారీ ప్రాణ నష్టం ?

చౌటుప్పల్ బృందావన్ ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్లు.. భారీ ప్రాణ నష్టం ?

చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామ పరిధిలోని బృందావన్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది.  షార్క్ట్ సర్క్యూట్తో రెండు రియాక్టర్లు పేలి భారీ శబ్దాలతో మంటలు ఎగసిపడుతున్నాయి. కంపెనీలో పని చేసే కార్మికులకు భారీ ప్రాణ నష్టం వాటిల్లిందని సమాచారం.

చౌటుప్పల్​మండలం మల్కాపురం, కొయ్యలగూడెం, ఎల్లగిరి, ఎల్లంబావి, కొయ్యలగూడెం, ధర్మోజిగూడెం, చౌటుప్పల్, తంగడపల్లి, లింగారెడ్డిగూడెం, ఎస్​.లింగోటం, మందోళ్లగూడెం, లింగోజిగూడెం, ఆరెగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, కాట్రేవు, భూదాన్​ పోచంపల్లి మండలం దోతిగూడెం, అంతమ్మగూడెం, జుబ్లక్​పల్లి, నారాయణగిరి, బీబీనగర్​ మండలం కొండమడుగు, బీబీనగర్​, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాల్లో కంపెనీలున్నాయి. 

ఇందులో ప్రధానంగా ఇంటర్మీడియట్, బల్క్ డ్రగ్​ కంపెనీలు ఉన్నాయి. గతేడాది జైకేసారం గ్రామంలోని ఎస్ఆర్ ఫార్మా కంపెనీలో కూడా అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.