మెదక్ జిల్లా తూప్రాన్లో హైడ్రామా.. గొడవకు దారితీసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాంపు రాజకీయం

మెదక్ జిల్లా తూప్రాన్లో హైడ్రామా.. గొడవకు దారితీసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాంపు రాజకీయం

తూప్రాన్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడైన క్రమంలో.. శుక్రవారం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో కొద్ది సేపు రాజకీయ హైడ్రామా చోటు చేసుకుంది. పట్టణంలో 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 4, బీజేపీ 3  స్థానాలు గెలుపొందాయి.

6వ వార్డు నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి కొక్కొండ సమతా కాశిరెడ్డిని క్యాంపునకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అతని ఇంటికి వచ్చారు. కాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడికి వచ్చి వారిని అడ్డుకొని కాంగ్రెస్ అభ్యర్థులకు సపోర్టుగా సమతా కాశిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ క్యాంపునకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య గొడవకు దారి తీసింది. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలకు చెందిన నాయకులను చెదరగొట్టి గొడవ సద్దుమణిగెల చేశారు. చివరకు సమత కాశిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో వారి క్యాంప్కి వెళ్లిపోయారు.