డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి: కలెక్టరేట్ల ముందు DJFT ధర్నా

డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి: కలెక్టరేట్ల ముందు DJFT ధర్నా

హైదరాబాద్: డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, జీవో 252ను వెంటనే సవరించాలని డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్​ తెలంగాణ డిమాండ్ చేసింది. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న వారికి అక్రెడిటేషన్ ఇవ్వకపోవడం అంటే కష్టపడి సాధించుకున్న హక్కును గుంజుకోవడమే అని నాయకులు ఆరోపించారు. డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డులు ఇస్తామంటూ తెచ్చిన జీవోను వ్యతిరేకిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా డెస్క్ జర్నలిస్టులు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేశారు.

ఈ సందర్భంగా DJFT (డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్​ తెలంగాణ) నాయకులు మాట్లాడుతూ.. రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు కలిస్తేనే జర్నలిజం అవుతుందన్నారు. ఇన్ పుట్.. అవుట్ ఫుట్.. రెండూ ఉంటేనే మీడియా పరిపూర్ణం అవుతుందని.. ఇందులో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే తీరును మాసుకోవాలని డిమాండ్ చేశారు.

►ALSO READ | ‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్లో ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

మీడియా కార్డుల పేరుతో డెస్క్ జర్నలిస్టులను సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా మార్చే ప్రయత్నం విరమించుకోవాలన్నారు. బస్ పాస్, ఇండ్ల స్థలాల కేటాయింపులో కోత పెట్టేందుకే వర్కింగ్ జర్నలిస్టులను విభజించే ఈ పాలసీ తీసుకొస్తున్నారనే ప్రచారం నిజమని భావించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలోనే వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.