ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టారు : ఎంపీ మల్లు రవి

ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టారు :  ఎంపీ మల్లు రవి
  •     ఎంపీ మల్లు రవి వ్యాఖ్య

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేసినా, కుట్రలకు దిగినా ప్రజలు మాత్రం అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్ బడ్జెట్ తొలి సెషన్ ముగిసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. 

రెండేండ్ల కాంగ్రెస్ ప్రజా పాలనపై ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని చెప్పేందుకు లోకల్ బాడీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే నిదర్శనమని చెప్పారు. ఇప్పటికైనా బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు, కుతంత్రాలు, వ్యక్తిగత దూషణలు మాని...  నిర్మాణాత్మకైన విపక్ష పాత్రను పోషించాలని కోరారు.