న్యూఢిల్లీ: జునైద్ సిద్ధిఖీ (5/35) ఐదు వికెట్ల హాల్‌కు తోడు అర్యాన్ష్ శర్మ (53 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 నాటౌట్), షోయబ్ ఖాన్ (29 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన గ్రూప్–డి మ్యాచ్‌లో యూఏఈ 5 వికెట్ల తేడాతో కెనడాపై గెలిచింది. టాస్ నెగ్గిన కెనడా 20 ఓవర్లలో 150/7 స్కోరు చేసింది. దిల్‌ప్రీత్ బజ్వా (11), యువరాజ్ సమ్రా (5), నికోలస్ కిర్టన్ (4) నిరాశపర్చడంతో కెనడా 38/3తో కష్టాల్లో పడింది.
ఈ దశలో హర్ష్ ఠాకరే.. నవనీత్ ధలివాల్ (34)తో నాలుగో వికెట్‌కు 31, శ్రేయస్ మొవ్వా (21)తో ఐదో వికెట్‌కు 33 రన్స్ జత చేశాడు. జస్కరణ్ సింగ్ (4 నాటౌట్), డిలాన్ హైలిగర్ (6 నాటౌట్), సాద్ బిన్ జాఫర్ (5) బ్యాట్లు ఝుళిపించకపోవడంతో కెనడా ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. తర్వాత యూఏఈ 19.4 ఓవర్లలో 151/5 స్కోరు చేసి నెగ్గింది. ఓపెనర్ ఆర్యాన్షు చివరి వరకు నిలబడ్డాడు. కెప్టెన్ మహ్మద్ వసీమ్ (4), అలిషాన్ షరాఫ్ (5), మయాంక్ కుమార్ (4), హర్షిత్ కౌశిక్ (5) విఫలమయ్యారు. దాంతో 66/4తో ఎదురీత మొదలుపెట్టిన యూఏఈని ఆర్యాన్ష్, షోయబ్ ఆరో వికెట్‌కు 84 రన్స్ జోడించి విజయాన్ని అందించారు. సాద్ బిన్ జాఫర్ 3 వికెట్లు తీశాడు. జునైద్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
