చిట్యాల, వెలుగు : నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించింది. మున్సిపాలిటీలోని ఒకటో వార్డు పరిధి శివనేనిగూడెంలో ట్రాన్స్‌జెండర్ నాగిళ్ల కావేరి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్, సీపీఎం ఉమ్మడి అభ్యర్థిపై 103 ఓట్ల మెజార్టీతో కావేరి విజయం సాధించింది. ఈ సందర్భంగా కావేరి మాట్లాడుతూ... తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
