హైదరాబాద్: ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కిన‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ ఈవెంట్ కైతలాపూర్ గ్రౌండ్స్లో సాయంత్రం 5 గంటల నుంచి మొదలుకానుంది. పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ చేశారు. భారీగా ట్రాఫిక్ జాం అయి ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉండటంతో.. సాయంత్రం నుంచి రాత్రి వరకూ కొన్ని రూట్లలో వెళ్లకపోవడం బెటర్ అని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
మూసాపేట్ నుంచి హఫీజ్ పేట్, KPHB.. మాదాపూర్ నుంచి కైతలాపూర్ గ్రౌండ్స్ (వయా ఫ్లైఓవర్), కూకట్ పల్లి ఐడీఎల్ లేక్ నుంచి కైతలాపూర్ ఫ్లైఓవర్ రూట్లో ప్రయాణాలు ప్లాన్ చేసుకోకపోవడం బెటర్ అని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వీలైనంత వరకూ సొంత వాహనాల్లో కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో (సిటీ బస్సులు, మెట్రో రైలు) ప్రయాణించడం మంచిదని పోలీసులు సూచించారు.
ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న‘ది రాజా సాబ్’ ట్రైలర్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జనవరి 8న నైట్ నుంచే ప్రీమియర్ షోలు ఉంటాయి. హారర్ జానర్లో తెరకెక్కిన ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
►ALSO READ | JrNTR-Kajol: తారక్ తల్లిగా బాలీవుడ్ క్వీన్ కాజోల్?.. 'డ్రాగన్' కథా నేపథ్యం ఇదేనా?
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నివహిస్తున్నారు. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ చేస్తుండగా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.
