నల్గొండ డీఎస్పీపై.. డీజీపీకి ఫిర్యాదు

నల్గొండ డీఎస్పీపై.. డీజీపీకి ఫిర్యాదు

బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్ లోని లక్డికాపుల్‌‌‌‌లో ఉన్న డీజీపీ కార్యాలయంలో నల్గొండ డీఎస్పీ శివారాం రెడ్డిపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్ నాయక్ మాట్లాడుతూ, నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఓటు వేయడానికి బూత్‌‌‌‌లోకి వెళ్లిన సమయంలో దొంగ ఓట్లపై ప్రశ్నించగా, డీఎస్పీ శివారాం రెడ్డి దాడి చేశారని ఆరోపించారు. 

కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దాడికి పాల్పడిన డీఎస్పీని తక్షణమే సస్పెండ్ చేయాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారని చెప్పారు. పోలీసులను బహిరంగంగా దూషిస్తున్న కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవడం లేదని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.