రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ మున్సిపల్లో హస్తం హవా కనిపించింది. 28 వార్డుల్లో.. కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 05, బీజేపీ 08, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు. అయితే.. గెలిచిన ఆ ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ గూటికి చేరారు. ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా కాంగ్రెస్లో చేరడంతో మున్సిపల్ పీఠం చైర్మన్, వైస్ చైర్మన్ పదవి కాంగ్రెస్కే దక్కాయి.
ఇద్దరు ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్ చేరికతో కాంగ్రెస్ బలం 16కి చేరింది. బీఆర్ఎస్ బలం 04కి పడిపోయింది. వేములవాడ మున్సిపాలిటీలో గత టర్మ్ చైర్మన్ సీటు మహిళకే దక్కింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్కు చెందిన 28మంది అభ్యర్థులు బుధవారం రాత్రి క్యాంప్నకు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.
►ALSO READ | ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. ఏ మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు గెలిచిందంటే..
మొదటి నుంచీ వేములవాడ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఎమ్యెల్యే అది శ్రీనివాస్ వ్యూహ రచన చేశారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వేములవాడలో అనుకున్నది సాధించింది. ఇదిలా ఉండగా.. మేయర్, చైర్పర్సన్ఎన్నికలకు మూడు రోజుల టైమ్ మాత్రం ఉండడంతో దాదాపు అందరూ గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్శివార్లలో ఉన్న రిసార్ట్లు, ఫామ్హౌజ్లకు తరలించారు. మేయర్, చైర్పర్సన్ ఎన్నిక జరిగే 16న ఉదయం 10 గంటలకు డైరెక్టుగా మున్సిపాలిటీ దగ్గరకే వారిని తీసుకుచ్చేలా ప్లాన్ చేశారు.
