మున్సిపాలిటీ ఎన్నికల్లో సంచలనం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఘన విజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా AIFB పార్టీ.. అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు విజయం సాధించారు.
వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా.. 8 వార్డులను ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ.. మరో ఒక వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు.
వార్డుల వారీగా ఫలితాలను చూస్తే..
1వ వార్డులో AIFB అభ్యర్థి విజయం
2వ వార్డులో AIFB అభ్యర్థి గెలుపు
3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం
4వ వార్డులో AIFB అభ్యర్థి గెలుపు
5వ వార్డులో AIFB అభ్యర్థి విజయం
6వ వార్డులో AIFB అభ్యర్థి గెలుపు
7వ వార్డులో AIFB అభ్యర్థి విజయం
8వ వార్డులో AIFB అభ్యర్థి గెలుపు
9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం
10వ వార్డులో AIFB అభ్యర్థి గెలుపు
అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్.. మరో వైపు బీజేపీ పార్టీలు కాకుండా.. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకోవటం సంచలనంగా.. ఆసక్తికరంగా మారింది.
