JrNTR-Kajol: తారక్ తల్లిగా బాలీవుడ్ క్వీన్ కాజోల్?.. 'డ్రాగన్' కథా నేపథ్యం ఇదేనా?

JrNTR-Kajol: తారక్ తల్లిగా బాలీవుడ్ క్వీన్ కాజోల్?.. 'డ్రాగన్' కథా నేపథ్యం ఇదేనా?

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'డ్రాగన్'.  పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో వెండితెరపై మ్యాజిక్ చేయడానికి ఈ ఇద్దరు రెడీ అవుతున్నారు. కమర్షియల్ సినిమాల మేకింగ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ కు గుర్తింపు ఉంది. 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో డార్క్ థీమ్ యాక్షన్‌ను ఒక రేంజ్‌కు తీసుకెళ్లిన నీల్, ఈసారి ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తారనే ఉత్కంఠ యావత్ సినీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

షూటింగ్ స్పీడ్ అప్!

చాలా కాలం పాటు ఈ సినిమా గురించి ఎలాంటి అధికారిక అప్డేట్స్ లేకపోవడంతో, ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర యూనిట్ ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ షెడ్యూల్‌ను ప్రారంభించింది. సుమారు మూడు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కీలకమైన యాక్షన్ ఘట్టాలను, కొన్ని డ్రామా సీన్లను చిత్రీకరించనున్నారు.

కథా నేపథ్యం..

ఈ సినిమా కథా నేపథ్యంపై ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన టాక్ నడుస్తోంది. 1969వ కాలంలో భారత్, చైనా , భూటాన్ సరిహద్దుల నేపథ్యంలో ఈ చిత్రం సాగనుందని సమాచారం. ఆ సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, సరిహద్దు ఘర్షణలు , వాటి మధ్య ఒక సామాన్యుడి పోరాటం ఎలా సాగిందనేది ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో ఆవిష్కరించబోతున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, నీల్ సినిమాల్లో ఉండే బలమైన 'మదర్ సెంటిమెంట్' ఈ చిత్రంలోనూ హైలైట్ కానుంది.

ALSO READ :  వసూళ్ల వేటలో ‘ఛాంపియన్’ దూకుడు.. 

తారక్ తల్లిగా బాలీవుడ్ క్వీన్ కాజోల్?

ఈ క్రేజీ ప్రాజెక్టులో ఎన్టీఆర్ తల్లి పాత్ర కోసం మేకర్స్ ఒక స్టార్ నటిని వెతుకుతున్న క్రమంలో, బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కథలో అత్యంత కీలకమైన ఈ పాత్ర కోసం ఆమెను సంప్రదించారని, ఆమె కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అదే నిజమైతే, స్క్రీన్ పై ఎన్టీఆర్ - కాజోల్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

స్టార్ కాస్ట్ ..

కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈమెకు ఇది తెలుగులో,  పాన్ ఇండియా స్థాయిలో భారీ బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ మరోసారి తన బీజీఎంతో థియేటర్లను దడదడలాడించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం, వచ్చే ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఎన్టీఆర్ తన నటనతో, ప్రశాంత్ నీల్ తన విజువల్ వండర్‌తో ఈ సినిమాను ఇండియన్ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుపుతారనడంలో సందేహం లేదు. 'డ్రాగన్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి!