మేయర్, ఛైర్మన్ల ఎన్నిక.. SEC కీలక ఆదేశాలు

మేయర్, ఛైర్మన్ల ఎన్నిక.. SEC కీలక ఆదేశాలు

మేయర్,  మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన జారీ చేసింది.   మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ లో  కీలకంగా మారిన ఎక్స్ అఫీషియో  ఓటు వేయాలంటే  స్థానిక మున్సిపాలిటీలో ఓటరుగా నమోదు కావడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ఆదేశాలు జారీ చేసింది.   ఎస్ఈసీ ఆదేశాలతో ఎంపీలు,ఎమ్మెల్సీలు ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా ఓటు వేయాలంటే స్థానిక మున్సిపల్ లేదా కార్పొరేషన్లో ఓటు తప్పనిసరి ఉండాలి లేకపోతే ఓటు చెల్లదని ఈసీ తేల్చి చెప్పింది.గతంలో తమకు నచ్చిన మున్సిపాలిటీని ఎంచుకుని ఎక్స్ అఫీషియో ఓటు వేసే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాలతో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.  

16న చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్​, మేయర్ల ఎన్నిక 

ఈ నెల 16న 116 మున్సిపాలిటీల చైర్ ​పర్సన్లు, ఏడు కార్పొరేషన్ ​ మేయర్ల ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ ​రిలీజ్​ చేసింది. ఒక్కో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో మొత్తం వార్డు సభ్యులతోపాటు ఆ రోజు మీటింగ్‌‌‌‌కు అటెండ్​అయ్యే ఎక్స్​అఫీషియో సభ్యుల ఓట్లతో కలిపి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని మేయర్​, డిప్యూటీ మేయర్​, చైర్​పర్సన్లు, డిప్యూటీ చైర్​పర్సన్లుగా ఎన్నుకుంటారు. 

 ఫిబ్రవరి16 మధ్యాహ్నం 12:30 గంటల  జరిగే  ప్రత్యేక సమావేశానికి ఫామ్ 2 నోటీసు తప్పని సరని సూచించింది.  సమావేశానికి ఒక రోజు ముందే సభ్యులకు నోటీసు అందాలని సూచించింది. 15న మధ్యాహ్నం 12:30 గంటల లోపు సభ్యులకు ఫామ్ -2 నోటీసులు ఉండాలని ఆదేశించింది.